Kasuri Methi | కమ్మని విందుకు, కచ్చితమైన ఆరోగ్యానికి కసూరి మెంతికూర!
Kasuri Methi Health Benefits: కసూరి మేతి లేదా ఎండు మెంతికూర కూరల్లో రుచినే కాదు, మీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
ఆహారం రుచి పెంచాలన్నా, ఆరోగ్యం కోసమైనా కసూరి మెంతికూర (Dried Fenugreek Leaves) ను ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా వాడుతుంటారు. కసూరి మెంతికూరలో కూడా తాజా మెంతికూర లాగానే పుష్కలమైన పోషకాలు కలిగి ఉంటుంది. అయితే కసూరి మెంతిని నిల్వ ఉంచుకొని ఏ వంటకంలో అయినా వాడుకోవచ్చు. కసూరి మెంతికూరలో కాల్షియం, ఐరన్, విటమిన్-సి వంటి పోషకాలతో పాటు యాంటీ ఇన్ల్పమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారినుంచి రక్షిస్తుంది. చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కసూరి మెంతికూరలో ఉండే హీలింగ్ ఎఫెక్ట్ శరీరం వాపు, నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
Kasuri Methi Health Benefits
కసూరి మెంతికూరను రోజూ మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
జీర్ణసమస్యలు దూరం
కసూరి మెంతి కూరల్లో వాడుతుంటే మలబద్ధకం, అతిసారం, ఆమ్లత్వం, కడుపు నొప్పి వంటి అనేక జీర్ణ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. అంతే కాదు, కసూరి మెంతికూరలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, విటమిన్-సి వంటి గుణాలు పొట్ట అలర్జీలను తగ్గించి, పొట్టను శుభ్రపరుస్తుంది.
మొటిమలు తగ్గుతాయి
కసూరి మెంతికూరలో ఉండే విటమిన్-సి, ఐరన్ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. అంతే కాదు, నల్లటి వలయాలు నివారిస్తుంది, మొటిమలు, దద్దుర్లు సమస్యకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
జుట్టుకు మేలు చేస్తుంది
కసూరి మెంతి జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది ఐరన్, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇవి జుట్టుకు కుదుళ్లనుండి బలపరుస్తాయి. తలలో దురదను కూడా తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది
కసూరి మెంతి అథెరోస్ల్కెరోసిస్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. లిపిడ్ హెచ్చుతగ్గులతో బాధపడుతున్న రోగులు ఈ హెర్బ్ ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మధుమేహాన్ని నియంత్రణకు
కసూరి మెంతి గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించే ఔషధ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్‌గా పనిచేస్తుంది, ఇది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి మేలు చేస్తుంది.
పాలిచ్చే తల్లులకు మేలు
కసూరి మేతిని పాలిచ్చే తల్లి ఆహారంలో చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పాల ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కసూరి మెంతి సహజ గెలాక్టగోగ్, అంటే ఈ మూలిక పాలిచ్చే తల్లులలో రొమ్ము పాల ఉత్పత్తిని పెంచుతుంది. మెంతులు, మెంతికూర ఇవన్నీ కూడా పాలిచ్చే తల్లులు ఆహారంగా తీసుకోవాలి. తల్లి పాల సరఫరాను పెంచడానికి సహాయపడుతుంది.
సంబంధిత కథనం