తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Facts : నిద్ర గురించి మీకు తెలియని, ఆశ్యర్యపరిచే విషయాలు ఇవి

Sleeping Facts : నిద్ర గురించి మీకు తెలియని, ఆశ్యర్యపరిచే విషయాలు ఇవి

HT Telugu Desk HT Telugu

10 April 2023, 20:00 IST

    • sleep facts and myths : ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ నిద్ర. మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర చాలా అవసరం. సరిగ్గా నిద్రపోనివారు లేదా నిద్ర పట్టడం కష్టంగా ఉన్నవారు మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
నిద్ర
నిద్ర (unsplash)

నిద్ర

నిద్రలేమితో(Sleeping Disorder) బాధపడేవారు ఆందోళన, ఒత్తిడి, ఏకాగ్రత లోపానికి గురవుతారు. అలాగే నిద్ర సరిగా పట్టని వారు మరుసటి రోజు అలసిపోయినట్లు కనిపిస్తారు. బరువు పెరగడం, రోగనిరోధక శక్తి(Immunity) తక్కువ ఉండటం సమస్యలను కలిగి ఉంటారు. అయితే నిద్రలో జరిగే కొన్ని షాకింగ్ విషయాల గురించి తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

Almond Skin Care Tips : బాదం పప్పును ఇలా వాడితే మీ చర్మం మెరిసిపోతుంది.. ట్రై చేయండి

Chana Masala Recipe : శనగలతో ఇలా రెసిపీ చేస్తే.. చపాతీ, రైస్‌లోకి లాగించేయెుచ్చు

నిద్రించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ధ్యానం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాలు(Healthy Food) తినడం మొదలైనవి నిద్రకు సహాయపడతాయి. అయితే, నిద్రకు సంబంధించి అనేక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీరు నిద్ర గురించి ఈ ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. ఆలస్యం చేయకుండా వాటి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా, నిద్రలో కనుబొమ్మలు చుట్టూ తిరుగుతాయి. నిద్రలో ఐదు దశలు ఉంటాయి. ఈ కంటి కదలికలు ఐదో దశలో ప్రారంభమవుతాయి. దీనిని ర్యాపిడ్ ఐ మూమెంట్(rapid eye movement) అంటారు. ఈ సమయంలో మీరు గాఢ నిద్రలో ఉంటారు.

మీ కలలో మీరు పరిగెత్తడం, శారీరక శ్రమ చేయడం మొదలైనవి చూస్తారు. కానీ నిజానికి మీరు నిద్రపోతున్నప్పుడు మీ శరీరం పక్షవాతానికి(Sleeping Paralysis) గురవుతుంది! అవును, మీ శరీరం కదలదు. నిద్ర పక్షవాతం సమయంలో.. ఒక వ్యక్తి ఆడియో, విజువల్ భ్రాంతులు పొందుతాడు కానీ.. చలనం ఉండదు. అటు, ఇటు కదలలేరు. మాట్లాడలేరు. మనిషి నిద్రపోతున్నప్పుడు లేదా నిద్ర లేస్తున్నప్పుడు ఈ ఫీలింగ్ పొందుతాడు. ఇది వ్యక్తి నిద్ర దశల మధ్య జరుగుతుంది. ఈ స్థితి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంటుంది. ఇది ఒత్తిడికి దారితీస్తుంది.

కొన్నిసార్లు మీరు నిద్రపోతున్నప్పుడు(Sleeping) అకస్మాత్తుగా మేల్కొంటారు. మరికొన్నిసార్లు బెడ్ లేదా సోఫా నుండి పడిపోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా నిద్రలో కనిపిస్తుంది. నిజానికి మెదడు నిద్రపోవడం, మిమ్మల్ని నిద్రపోకుండా చేయడం మధ్య గందరగోళం చెందుతుంది. అయితే ఇలా ఎందుకు కిందపడిపోతారో.. సరైన కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా కనుగొనలేదు.

ఒక అధ్యయనం ప్రకారం, నిద్రలో మీ శరీరం(Body) మిమ్మల్ని కోమా లాంటి స్థితికి చేరుకోకుండా చేస్తుంది. మేల్కొనే స్థితికి చేరుకునే ముందు.., శరీరం ఎప్పుడు కావాలంటే అప్పుడు మేల్కొనే దశకు వస్తుంది. అంటే నిద్రలో కూడా మెదడు వాస్తవ ప్రపంచంతో అనుసంధానమై ఉంటుందన్నమాట.. ఇది నిద్రలో జరిగే అద్భుతం.

6 శాతం మంది నిద్రలో మాట్లాడుతుంటారు. స్త్రీలు, పిల్లల కంటే పురుషులలో ఇది చాలా సాధారణం. ఈ పరిస్థితిని సోమనిలోకీ అంటారు. ఇది ప్రమాదకరమైనది, మీరు దీన్ని గుర్తుంచుకోలేరు. కానీ ఇది మీ పక్కన పడుకున్నవారిని చికాకుపెడుతుంది. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, డిప్రెషన్(Depression), ఇతర వ్యాధులు.

చాలా మంది నిద్రపోతున్నప్పుడు పళ్ళు కొరుకుతూ ఉంటారు. దీనిని వైద్య భాషలో బ్రక్సిజం(bruxism) అంటారు. ఇది దంతాలను వికృతం చేస్తుంది. దీని నుండి దవడలు దెబ్బతింటాయి. ఇది కూడా ఒత్తిడి, టెన్షన్ వల్ల వస్తుందని తెలిసింది. దీని కోసం వెంటనే మీ దంతవైద్యుడిని కలవండి. మౌత్ గార్డ్‌ను అమర్చుకోండి.

మీరు నిద్రలో రింగింగ్ సౌండ్(Ringing Sound) వినవచ్చు. ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత ఈ శబ్దాలు, అంటే పేలుళ్లు లేదా తుపాకీ కాల్పుల వంటి శబ్దాలు వినిపిస్తాయి. దీన్నే ఎక్స్‌ప్లోడింగ్ హెడ్ సిండ్రోమ్(exploding head syndrome) అంటారు. నొప్పిలేకుండా ఉంటుంది, కానీ మిమ్మల్ని భయాందోళనకు గురిచేస్తుంది.

తదుపరి వ్యాసం