తెలుగు న్యూస్ / ఫోటో /
Panic Attack | అనవసరంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారా? అయితే అది ఇదే!
- ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండానే కొంతమంది తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఆకస్మికంగా మొదలవుతుంది. దీంతో తమపై తాము నియంత్రణ కోల్పోయినట్లుగా భావిస్తారు. గుండెపోటు లేదా మరణిస్తున్నారని భావిస్తారు. ఈ పరిస్థితిని ప్యానిక్ అటాక్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.

(1 / 6)
పానిక్ అటాక్స్ ఎప్పుడైనా కలగవచ్చు. ఈ ఎపిసోడ్‌లు ఏ సమయంలోనైనా, నిద్రలో కూడా సంభవించవచ్చు. తీవ్ర భయాందోళనకు గురవుతున్న వ్యక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు. తమకేదో జరుగుతుందని భయపడతారు. తాము చనిపోతున్నట్లు భావిస్తారు. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తారు. దీనిగురించి వెల్ నెస్ నిపుణులు కరిష్మా షా చర్చించారు.(Pexels)
(2 / 6)
లక్షణాలు ఎలా ఉంటాయంటే.. తీవ్ర భయాందోళనకు గురయ్యేటపుడు వ్యక్తులు తమ చేతులు, కాళ్ళు, పాదాలు బలహీనంగా భావిస్తారు. రక్తప్రసరణ తగ్గడం వల్ల మీ పాదాలు, చేతుల్లో జలదరించినట్లు ఉంటుంది. కొంచెం తిమ్మిరి అనిపించవచ్చు.(Unsplash)
(3 / 6)
గుండె దడగా ఉంటుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అది నిశ్శబ్ద భయాందోళనకు సంకేతం కావచ్చు.(Pexels)
(4 / 6)
ఆలోచనలు ప్రవాహంగా వస్తాయి. ఆ ఆలోచనలు తరచుగా కలతపెట్టేవిగా ఉంటాయి. వాటిని అనుభవించే వ్యక్తికి కదలలేని స్థితికి భయపడేలా చేస్తాయి.(Pexels)
(5 / 6)
ఏదైనా షాక్ కు గురైనపుడు, ఒత్తిడి, తీవ్రమైన బాధ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. కళ్లు మూసికొని, గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి. వాస్తవ పరిస్థితిని గమనించాలి. అదంతా నిజం కాదు కేవలం ఆందోళన మాత్రమే అని గ్రహించాలి. కండరాలకు మసాజ్ చేయాలి. వైద్యుడ్ని సంప్రదించాలి. (Pexels)
ఇతర గ్యాలరీలు