de-stress | ఒత్తిడిని దూరం చేసే 3 సులభమైన మార్గాలు!
ఇప్పుడున్న కాలంలో ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు నిజంగా అదృష్టవంతులే! మరి మిగతా వారి సంగతేంటి? ఏం లేదు, మూడే మూడు దశల్లో సులభంగా ఒత్తిడి మాయం చేసుకోవచ్చట. అదెలాగో ఇక్కడ చూడండి.
ఇప్పుడున్న కాలంలో ఒత్తిడి, ఆందోళనలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు నిజంగా అదృష్టవంతులే! మరి మిగతా వారి సంగతేంటి? ఏం లేదు, మూడే మూడు దశల్లో సులభంగా ఒత్తిడి మాయం చేసుకోవచ్చట. అదెలాగో ఇక్కడ చూడండి.
(1 / 6)
ఇపుడు మన జీవితంలోనే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. టీవీ పెట్టినా, ఏ వార్త చదివినా అంతులేని నేరాలు, ఘోరాలు మన మనసును మరింత కలిచి వేస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయి. ప్రశాంతత అనేదే కరువైపోతుంది. అయితే ఆయుర్వేద నిపుణురాలు నేహా ప్రేమ్‌జీ ఒత్తిడిని మాయం చేసే సులభమైన మార్గాలను HT లైఫ్‌స్టైల్‌కి వివరించారు.
(SHVETS production)(2 / 6)
1.స్పృహతో కూడిన అవగాహన: అసలు మీ ఒత్తిడికి కారణమేంటో గ్రహించండి. ప్రస్తుతం ఏంటి? అనే స్పృహతో వ్యవహరించండి. కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. మంచి పుస్తకం ఏదైనా చదవండి.
(File Photo )(3 / 6)
2. వ్యాయామం: ఆత్రుతగా, ఆందోళనగా ఉంటే ఉన్నచోటు నుంచి శరీరాన్నికాస్త కదిలించండి. మీకు నచ్చిన ఏదైనా వ్యాయామం చేయండి. చురుకైన నడక, డాన్స్ ఏదైనా కావచ్చు. వారానికి రెండుసార్లు ఏరోబిక్ వ్యాయామం చేస్తే ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. మీరు చేసే శారీరక శ్రమ మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
(Gustavo Fring)(4 / 6)
3. నిద్రపోండి: కాసేపు అన్నింటినీ పక్కన పెట్టి, ఆలోచనలను కట్టిపెట్టి సుఖంగా నిద్రపోండి. ఏం జరుగుతుందో జరగనీ, భూకంపమైనా రానీ మీకు మీ నిద్రే ముఖ్యం అన్నట్లుగా నిద్రపోండి. అంతా సెట్ అవుతుంది.
(Shotshop/IMAGO)(5 / 6)
చివరగా ఒక్క మాట: ఒక వ్యక్తి రోజుకు కనీసం ఐదు నిమిషాలైనా ధ్యానం చేయాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు, స్ట్రెచింగ్, యోగా కూడా చేయవచ్చు అని సర్టిఫైడ్ డైటీషియన్ గరిమా గోయల్ తెలిపారు. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, అన్నం తినాలి. టీ, కాఫీలు, మద్యం మానేయాలని సూచించారు.
(Shutterstock)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు