Stress Management | ఒత్తిడితో బాధపడుతున్నారా? అయితే ఇలా బై బై చెప్పేద్దాం..
ఈ రోజుల్లో అందరిని బాధించి, వేధించేది ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఒత్తిడే. మనసును, మన ఆలోచనలను అదుపులో ఉంచుకోలేనప్పుడు ఈ ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. డిప్రెషన్ ఉన్నవాళ్లు గందరగోళానికి గురవడమే కాకుండా.. పలు అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేయండి.
Stress Management | కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఒత్తిడిని అదుపు చేయలేము. ఒత్తిడిని అదుపు చేయలేకపోతున్నామనే ఒత్తిడితో ఒత్తిడికి గురవుతాము. చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా మరొక్కసారి ఆ లైన్ చదవండి మీకు కూడా నిజమే అనిపిస్తుంది. స్ట్రైస్ను ఎంత స్ట్రెస్ చేస్తే అంత ఇబ్బందులు ఎదుర్కొవాలి. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకునేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఒత్తిడి వల్ల మానసికంగానే కాదు.. శారీరకంగాను కొన్ని సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్, డిప్రెషన్, మైగ్రేన్ వంటి వాటి నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీయవచ్చు. మీరు కూడా ఒత్తిడి బాధపడుతున్నట్లయితే.. ఈ చిట్కాలను ఫాలో అయిపోండి. ఒత్తిడికి బై బై చెప్పేయండి.
ప్రకృతితో మమేకం..
మారుతున్న జీవనశైలి, కుటుంబ కలహాలు లేదా భవిష్యత్తు గురించి ఆందోళనల కారణంగా చాలా మంది ఒత్తిడి, నిరాశను ఎదుర్కొంటారు. బిజీ లైఫ్ కొన్నిసార్లు చాలా మంది జీవితంలో అనియంత్రిత ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న పనుల నుంచి కొంత విరామం తీసుకోండి. ఈ విరామంలో ఇంట్లో కూర్చోకుండా.. ప్రకృతితో మమేకమవండి. నేచర్కి దగ్గరగా ఉండడం వల్ల మనకు కాస్త ఊరట దొరుకుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది.
నచ్చినపని చేయండి..
బాగా ఒత్తిడికి గురైనప్పుడు అన్నింటిని మరచిపోయి నచ్చని పని చేయండి. మీరు ఇష్టపడేదాన్ని చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి మీ దృష్టి ఒత్తిడి నుంచి ఆనందం వైపు మళ్లుతుంది. ఇష్టపడే పనులు చేస్తే మనసుకు హాయిగా ఉంటుంది.
నచ్చినవారితో మాట్లాడండి..
ఒత్తిడి, డిప్రెషన్ నుంచి బయటపడటానికి.. మీకు ప్రియమైన వారితో మాట్లాడండి. కుదిరితే కలిసి కుర్చోని మాట్లాడండి. లేదంటే ఫోన్ చేసి కబుర్లు చెప్పుకోండి. దీనివల్ల మనసు తేలికవుతుంది.
యోగా..
ఒత్తిడి తగ్గించుకోవాలనుకునే వారికి యోగా, ధ్యానం లేదా వ్యాయామం మంచి ఎంపిక. లోతైన శ్వాస తీసుకోవడం లేదా ధృవీకరణలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ప్రతికూల లేదా విషపూరితమైన ఆలోచనల నుంచి మీ దృష్టిని సానుకూలంగా మళ్లించడం కోసం అవి మీకు సహాయపడతాయి. ధ్యానం లేదా లోతైన శ్వాస అనేది కార్టిసాల్ లేదా ఒత్తిడి హార్మోన్‌ను తగ్గించడం, సంతోషకరమైన హార్మోన్‌లను విడుదల చేయడంలో తక్షణమే మీకు సహాయం చేస్తుంది.
ఇంటిని శుభ్రం చేయండి..
ఒత్తిడి, నిరాశ అనేది మీ చుట్టూ ఉన్న పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇంటిని శుభ్రం చేయడం, పడకగదిని చక్కబెట్టుకోవడం లేదా బట్టలు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి. వీటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి అనేది ఏవో మందులు వాడితే తగ్గుతుంది అనుకోవడం పొరపాటే. దానిని తగ్గించుకోవడం అనేది పూర్తిగా మీరు చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది.
సంబంధిత కథనం