తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Quote : లేని వాటి గురించి బాధపడకుండా.. ఉన్నవాటితో సంతోషించాలి..

Saturday Quote : లేని వాటి గురించి బాధపడకుండా.. ఉన్నవాటితో సంతోషించాలి..

25 June 2022, 10:38 IST

    • జీవితంలో ఆశ, సానుకూలతతో ముందుకు సాగాలి. మనం మన సామర్థ్యాలను సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించాలి. కాబట్టి మనకి అవసరమైనవి గుర్తించుకుని.. అవసరం లేని మరిచిపోవాలి. మీ సమస్యలను పక్కన పెట్టి.. పాజిటివ్ మైండ్​తో ముందుకు వెళ్లినప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది.
మోటివేషనల్ కోట్
మోటివేషనల్ కోట్

మోటివేషనల్ కోట్

Saturday Motivation : జీవితంలో మన వైఖరి చాలా ముఖ్యం. మన దృక్పథం, చర్యలు, మనం చేసే పనులు మనల్ని నిర్వచిస్తాయి. మన వైఖరి మనకు, మన చుట్టూ సైతం అభివృద్ధి చెందడానికి సహాయపడేలా ఉండాలి. మనం జీవితంలో ఆశ, సానుకూలతతో ముందుకు సాగాలి. మనం మన సామర్థ్యాలను.. సాధ్యమైనంత ఉత్తమమైన స్థాయికి తీసుకెళ్లాలి. అవి మనం జీవితంలో ఎదగడానికి సహాయం చేస్తాయి.

కొన్ని సమస్యలు మనల్ని ఇబ్బంది పెడతాయి. కానీ మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోకపోవడమే మంచిది. సమస్యలు ఎప్పుడూ ఉండేవే. వాటిని ఓవర్​కామ్ చేయడం కష్టం. అయినా సరే మనల్ని మనమే మోటీవేట్ చేసుకోవాలి. అలాంటి సమయాల్లో మనకున్న పాజిటివ్ థింగ్స్​ని లెక్కించుకోవాలి. ఇవి మనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి.

వైఫల్యం, సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం మన సమస్యలను తప్ప మరేమీ చూడలేము. బదులుగా.. అటువంటి సందర్భాలలో.. మనం వేటిని కలిగి ఉన్నమో అనే విషయాలు, వ్యక్తులపై శ్రద్ధ వహించాలి. ఇవి మన సమస్యలను ఎదుర్కొనేందుకు శక్తిని, ఆనందాన్ని ఇస్తాయి. మన జీవితాల్లో చాలా విషయాలు, వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి.

మన కష్టాల నుంచి మన పాఠాలు నేర్చుకోవాలి కానీ దానితో వచ్చిన బాధ, భయాన్ని ఎక్కువ కాలం పట్టుకుని కుర్చోకూడదు. మీరు సానుకూలంగా ముందుకు సాగినప్పుడే.. మీరు విజయం సాధిస్తారు. మీరు ఇష్టపడే పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకుంటే ఈజీగా ముందుకు సాగుతారు.

టాపిక్