తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : రేలంగి మావయ్యలా ఉండడానికి ఏ కారణాలు అవసరం లేదు..

Thursday Motivation : రేలంగి మావయ్యలా ఉండడానికి ఏ కారణాలు అవసరం లేదు..

23 June 2022, 8:04 IST

google News
    • చిరునవ్వులతో బతకాలి. చిరంజీవిలా బతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బతకాలి. అందరినీ బతికించాలి అన్నాడు ఓ గేయ రచయిత. కాబట్టి మీరు కూడా అందరితో మంచిగా ఉండండి. ఇతరులతో మంచిగా ఉండడానికి కారణం వెతుక్కోకండి. 
ఆనందంగా గడపండి
ఆనందంగా గడపండి

ఆనందంగా గడపండి

Thursday Motivation : సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాశ్​ రాజ్​ రేలంగి మావయ్య పాత్ర పోషించారు. ఈ పాత్ర ఎలాంటిదంటే.. ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ.. వారితో కలుపుగోలుగా ఉండే పాత్ర ఇది. ఈ పాత్ర నుంచి మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఇతరులతో మంచిగా ఉండడానికి ఎటువంటి కారణం అవసరం లేదు. పైగా మీ మంచితనమే మీకు గుర్తింపును తీసుకువస్తుంది. అందుకే మీరు ఇతరులతో మాట్లాడే సమయంలో మృదువుగా, మర్యాదగా మాట్లాడాలి. ఇతరుల పట్ల దయ కలిగి ఉండాలి. ఇలా ఉండటానికి మనకి ఏ కారణం అవసరం లేదు. పరిచయస్తులతోనైనా.. అపరిచితులతోనైనా మీరు మంచి ప్రవర్తనను కొనసాగించవచ్చు.

మీరు ఇతరులతో ప్రవర్తించే విధానం.. మీ స్వభావాన్ని, మీ పెంపకాన్ని, మీ వ్యక్తిత్వాన్ని వివరిస్తుంది. కాబట్టి మీరు మీ విధానంలో, నడవడికలో ఎల్లప్పుడూ వినయంగా ఉండాలి. ఇతరులతో క్రూరంగా ఉండడం మానుకోవాలి. ఇతరులతో మర్యాదగా ప్రవర్తించకపోయినా పర్వాలేదు కానీ.. అమర్యాదగా మాత్రం ప్రవర్తించకూడదు. మీరు ఎక్కడికి వెళ్లినా.. ఇతరుల ముఖాల్లో చిరునవ్వు తెచ్చే వ్యక్తిగా మీరు ఎదగాలి.

ఇతరులతో మంచిగా ఉండటానికి మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచిగా ఉన్నప్పుడు.. వారు మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు. మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా.. ఇతరులతో మంచిగా లేకుంటే ఆ జ్ఞానం.. అజ్ఞానమే అవుతుంది. బాగా చదువుకుని.. మీ నోటి నుంచి చెడ్డమాటలే వస్తే.. అందరూ మిమ్మల్ని చదువున్న మూర్ఖుడిగా లెక్కిస్తారు. కాబట్టి ఇతరుల పట్ల శ్రద్ధగా, సానుభూతితో ఉండండి. ప్రతి ఒక్కరూ మెచ్చుకునే వ్యక్తిగా ఉండండి.

టాపిక్

తదుపరి వ్యాసం