తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Quote: ఈరోజు మీది కాకపోవచ్చు.. కానీ రేపు మీకు కచ్చితంగా మంచే జరుగుతుంది.

Tuesday Quote: ఈరోజు మీది కాకపోవచ్చు.. కానీ రేపు మీకు కచ్చితంగా మంచే జరుగుతుంది.

21 June 2022, 9:16 IST

    • రేపు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేము. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు మీ నమ్మకాన్ని కోల్పోకండి. మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ.. మంచి జరుగుతుందని ఆశించండి. కచ్చితంగా ఏదొకరోజు మీరు అనుకున్నది పొందే అవకాశం ఉంది
రేపు పక్కా మంచి జరుగుతుంది అనుకోండి..
రేపు పక్కా మంచి జరుగుతుంది అనుకోండి..

రేపు పక్కా మంచి జరుగుతుంది అనుకోండి..

Quote of the Day: మీరు ఏదైనా కావాలని లేదా పొందాలని ప్రయత్నించినప్పుడు అది మీకు దక్కపోవచ్చు. ఆ సమయంలో మీరు మీ నమ్మకాన్ని కోల్పోకూడదు. రేపు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు, నిర్ణయించలేరు కాబట్టి.. మీ ఆశను కోల్పోకండి. అనుకున్నది జరగలేదనే నిరాశతో.. మీ ఆశను చంపుకోకండి. మీ సంకల్పం గట్టిది అయితే ఏదొక రోజు మీ లైఫ్ మీకు నచ్చినట్టు మారుతుంది. మీకు నచ్చనిది జరుగుతుంది. 

ట్రెండింగ్ వార్తలు

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

Almond Skin Care Tips : బాదం పప్పును ఇలా వాడితే మీ చర్మం మెరిసిపోతుంది.. ట్రై చేయండి

Chana Masala Recipe : శనగలతో ఇలా రెసిపీ చేస్తే.. చపాతీ, రైస్‌లోకి లాగించేయెుచ్చు

ఏదైనా సాధించాలంటే ముందు ఎవరినో నమ్మకండి. ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా.. లేకపోయినా.. ఆ సంకల్పాన్ని వదులుకోకండి. ఈరోజు ఏదైనా తప్పు జరిగితే.. రేపు కూడా అదే జరుగుతుందని భావించకండి. ఆ తప్పు రేపు జరగకుండా మీరు ఏమి చేయగలరో దానిని చేసేందుకు ప్రయత్నించండి. అంతేకాకుండా మీరు నమ్మే వారిపై, దేవునిపై విశ్వాసం కలిగి ఉండాలి. 

మన జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితిని చూసిన తర్వాత.. చాలా మంది జీవితం మీద ఆశను కోల్పోతారు. మనకి ఇక మంచి జరగదు అనే భ్రమలో ఉంటారు. అలా అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ రోజు చెడు జరిగినా.. రేపు మంచి జరుగుతుందనే హోప్​తో ముందుకు వెళ్లాలి. మీ పనిపై దృష్టి పెట్టాలు. ఏమి చేయగలగాలో ఆలోచించాలి. ఓపికతో ఉండాలి. మీ సామర్థ్యాలను నమ్మితే మీకు మంచి ఫలితాలు కచ్చితంగా వస్తాయి. జీవితంలో అన్ని రకాల అనుభవాలు ముఖ్యమైనవని తెలుసుకోండి. ఇతరులను లేదా మిమ్మల్ని నిందించుకోవడం వీలైనంత త్వరగా ఆపేయండి. మీ మీద పూర్తి నమ్మకం ఉంచి పరిస్థితులను ఎదుర్కోండి. 

 

టాపిక్

తదుపరి వ్యాసం