తెలుగు న్యూస్  /  Lifestyle  /  Salsa Potatoes Recipe For Weekend Evening Snack

Salsa Potatoes Recipe : సాల్సా పొటాటో.. మీ సాయంత్రానికి అదిరే స్నాక్​

26 November 2022, 16:17 IST

    • Salsa Potatoes Recipe : వీకెండ్​లో మంచి స్నాక్​తో ఎంజాయ్ చేయాలనుకుంటే.. మీరు సింపుల్​గా, టేస్టీ ఐటమ్ తయారు చేసుకోవచ్చు. అదే సాల్సా పొటాటో. దీనిని తయారు చేయడం ఎంత సింపుల్ అంటే.. మీరు ఛాయ్ పెట్టుకుని.. అది అయ్యేలోపు.. ఈ స్నాక్ రెడీ చేసేసుకోవచ్చు. 
సాల్సా బంగాళదుంపలు
సాల్సా బంగాళదుంపలు

సాల్సా బంగాళదుంపలు

Salsa Potatoes Recipe : సాల్సా బంగాళదుంపలు అనగానే ఇదేదొ పెద్ద ప్రాసెస్ రెసిపీ అనుకుంటారు. కానీ దీనిని చేయడం చాలా సింపుల్. ఇంట్లో ఉండే ఐటమ్స్​తోనే.. దీనిని సులువుగా, ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Egg Chat: పిల్లలకు ఇలా ఎగ్ చాట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు

Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

కావాల్సిన పదార్థాలు

* బంగాళదుపంలు - 3

* కారం - 1 టేబుల్ స్పూన్

* బ్లాక్ పెప్పర్ - 1 టేబుల్ స్పూన్

* ధనియాపొడి - 1 టేబుల్ స్పూన్

* ఉప్పు - తగినంత

* ఉల్లిపాయ - 1

* టమోటా - 1

* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

కావాల్సిన పదార్థాలు

బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఓవెన్‌ను 150 డిగ్రీల సెల్సియస్ వద్ద ఐదు నిమిషాలు ముందుగా వేడి చేయండి. మీరు దానిపై కొంచెం నూనె వేయవచ్చు. లేదా నూనె లేకుండా కూడా రోస్ట్ చేయవచ్చు. బంగాళదుంపలు వేయించి.. వాటిని తీసి.. కారం, పెప్పర్, ధనియాపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపండి. దానిని తాజా టమోటాలు, ఉల్లిపాయలతో సర్వ్ చేయండి.

టాపిక్