తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pot Biryani Recipe Ypu Can Try At Home In Simple Way Here Is The Making Process

Pot Biryani Recipe : ఇంట్లోనే కుండ బిర్యానీ చాలా సింపుల్​గా చేసేయొచ్చు..

31 December 2022, 13:30 IST

    • Pot Biryani Recipe : పండుగలొచ్చినా.. పబ్బమొచ్చినా.. బిర్యానీ అనేది మెనూలో కచ్చితంగా ఉంటుంది. అయితే మీరు కొత్తగా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటే కుండ బిర్యానీ తయారు చేసుకోవచ్చు. 
కుండ బిర్యానీ రెసిపీ
కుండ బిర్యానీ రెసిపీ

కుండ బిర్యానీ రెసిపీ

Pot Biryani Recipe : ఇంట్లోనే కుండ బిర్యానీని తయారు చేయాలనుకుంటే అమ్మో.. కష్టపడాలి అనుకోకండి. చాలా సింపుల్​గా ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు కావాలి.. తయారీ విధానం వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ న్యూ ఇయర్​కి ఇంట్లో దీనిని ట్రై చేసి.. ఇంటిల్లీ పాది ఆనందంగా లాగించేయండి.

కావాల్సిన పదార్థాలు

చికెన్ కోసం..

* చికెన్ - 7-8 ముక్కలు (పెద్దవి)

* కారం - 1/2 టీస్పూన్

* మిరియాల పొడి - 1/2 టీస్పూన్

* ఉప్పు - తగినంత

రైస్ కోసం..

* బియ్యం - 1/2 కప్పు

* కారం - 1/2 టేబుల్ స్పూన్

* పసుపు - 1/2 టీస్పూన్

* బ్లాక్ పెప్పర్ - 1/2 టీస్పూన్

* ధనియా పొడి - 1 tsp

* ఉప్పు - రుచికి తగినంత

* చికెన్ స్టాక్ - 2 కప్పులు

తయారీ విధానం

చికెన్ ముక్కలను మట్టికుండలో తీసుకుని దానిలో కారం, పెప్పర్, ఉప్పు వేసి ఫ్రై చేయండి. వాటిని బంగారు రంగు వచ్చేవరకు ఉడికించండి. అనంతరం వాటిని బయటకు తీసి.. ఇప్పుడు అదే పాత్రలో కడిగిన బియ్యాన్ని వేసి అందులో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. బియ్యం కాస్త వేగిన తర్వాత.. అన్నం ఉడకడానికి చికెన్ స్టాక్ వేయాలి.

అనంతరం దానిని బాగా కలిపేయండి. పై నుంచి ముందుగా ట్రై చేసిన చికెన్ వేయాలి. దీన్ని మూతపెట్టి బియ్యం ఉడికినంత వరకు ఉడికించాలి. చివరిగా నిమ్మకాయ, కొత్తిమీర తరుగుతో దానిని గార్నిష్ చేసి మళ్లీ కలపాలి. అంతే వేడి వేడి కుండ బిర్యానీ రెడీ.