Malabar Fish Biryani Recipe : మలబార్ ఫిష్ బిర్యానీ.. న్యూ ఇయర్‌కి పర్ఫెక్ట్ డిష్
Malabar Fish Biryani Recipe : మీకు సీ ఫుడ్ ఇష్టముంటే.. కచ్చితంగా మీరు మలబార్ ఫిష్ బిర్యానీని ఇష్టపడతారు. అయితే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.
Malabar Fish Biryani Recipe : క్లాసిక్ మలబార్ ఫిష్ బిర్యానీని ఎప్పుడైనా తినవచ్చు. ఇది మీకు మనోహరమైన, మంచి రుచిని అందిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి దీనిని ఎలా తయారు చేయవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* మలబార్ ఫిష్ - 1 కిలో
* ఉల్లిపాయలు - 1 కిలో
* పచ్చిమిర్చి - 100 గ్రా
* వెల్లుల్లి - 70 గ్రా
* అల్లుల్లి - 70 గ్రా
* నిమ్మకాయలు - 2
* కొత్తిమీర - 1 కప్పు
* పెరుగు - 1 కప్పు
* ఉప్పు - రుచికి తగినంత
* బియ్యం - 1 కిలో
* నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
* నూనె - 1 కప్పు
* టమాట - ½ కిలో
* పసుపు - 1 టీస్పూన్లు
* కాజు - 2 టేబుల్ స్పూన్స్
* ఎండు ద్రాక్షలు - 2 టేబుల్ స్పూన్స్
* నీళ్లు - 4 గ్లాసులు (బియ్యం కప్పుల సంఖ్యకు అనుగుణంగా)
* యాలకులు - 3
* లవంగాలు - 3
* దాల్చిన చెక్క - కొంచెం
* గరం మసాలా - కొంచెం
తయారీ విధానం
250 గ్రాముల ఉల్లిపాయలను తీసుకొని వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి.. 1/2 కప్పు నెయ్యి వేసి వేడి చేయండి. జీడిపప్పు, కిస్మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి. దానిలో ఉల్లిపాయలు వేసి.. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. దానిలో పసుపు వేసి బాగా కలపండి. ఉప్పు వేసి బాగా కలపండి.
ఫ్రైయింగ్ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. చేపలను వేసి.. తేలికగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు భారీ అడుగున ఉన్న పాత్రలో 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకుని వేడి చేయండి. ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలను.. 1/2 కప్పు నీటితో వేసి బ్లెండర్లో వేసి మిక్సీ చేయండి. ఈ మిశ్రమాన్ని వేడి నూనెలో వేయండి. ఈ పేస్ట్‌ను ఉల్లిపాయ మిశ్రమంలో కలపండి. 3-4 నిమిషాలు బాగా వేయించండి. దానిలో టొమాటోలు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపండి. నీరు ఆవిరైపోయే వరకు కొంతసేపు ఉడికించాలి. దానిలో వేయించిన చేప ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి పక్కన పెట్టుకోండి.
బియ్యం కోసం
నాన్-స్టిక్ పాత్రలో నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో తరిగిన ఉల్లిపాయ, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించండి. వెంటనే కడిగిన బియ్యాన్ని (నీరు లేకుండా వడకట్టండి) వేయండి. దానిలో నీరు వేసి.. ఉప్పు వేసి అధిక మంటపై ఉడికించండి. 10 నిమిషాలు మూతపెట్టి ఉడకనివ్వండి. అన్నం మీద గరం మసాలా పొడిని వేయండి. ఇప్పుడు ఒక హెవీ బాటమ్ పాత్రను తీసుకుని.. దిగువన ఒక లేయర్‌లో ఉడికించిన అన్నాన్ని వేయండి. ఫిష్ మసాలా కొన్ని స్పూన్లు వేయండి. కొన్ని వేయించిన ఉల్లిపాయలు, గింజలు, ఎండుద్రాక్ష, కొద్దిగా గరం మసాలా పొడిని వేసి.. బియ్యం లేయర్ వేయండి. కొత్తిమీర వేసి గార్నీష్ చేయండి. దానిలో కొద్దిగా రోజ్ వాటర్, పాత్రను కవర్ చేయండి. రుచులు పెంచుకోవడానికి.. 1 గంట పాటు బిర్యానీని దమ్‌లో ఉంచండి. అనంతరం వేడి వేడిగా తినేయండి.
సంబంధిత కథనం
టాపిక్