Bamboo Chicken Biryani Recipe : బిర్యానీలందూ వెదురు చికెన్ బిర్యానీ వేరయా..
Bamboo Chicken Biryani Recipe : బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే మీరు మీ బిర్యానీని కాస్త కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే.. వెదురు బిర్యానీని ట్రై చేయవచ్చు. దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దానిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Bamboo Chicken Biryani Recipe : బొంగులో చికెన్ ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. మీరు చికెన్ ప్రియులు అయితే.. ముఖ్యంగా బిర్యానీ ఇష్టపడేవారు అయితే.. కచ్చితంగా బొంగులో చికెన్ బిర్యానీ ట్రై చేయవచ్చు. కుటుంబంతో కలిసి ఇలాంటి రెసిపీని ట్రై చేస్తే అదిరిపోతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* చికెన్ - 500 గ్రాములు
* ఉప్పు - 2 టేబుల్ స్పూన్లు
* మిరియాల పొడి - 1 టీ స్పూన్
* పసుపు - 1/2 టీస్పూన్
* కారం - 1 టీస్పూన్
* ధనియా పౌడర్ - 1 టీస్పూన్
* జీలకర్ర - 1/2 టీస్పూన్
* బిర్యానీ మసాలా - 1 టీస్పూన్
* అల్లం - 2 అంగుళాల ముక్క
* లంవంగాలు - 5
* వెల్లుల్లి - 10 రెబ్బలు
* పచ్చిమిర్చి - 4
* కొత్తిమీర, పుదీనా - ¼ కప్పు
* పెరుగు - 1/2 టీస్పూన్
* బాస్మతి రైస్ - 2 కప్పులు
* నెయ్యి/ ఆయిల్ - 4 టేబుల్ స్పూన్
* అన్ని మసాలా దినుసులు
* కుంకుమ - కొంచెం
* ఉల్లిపాయలు - పావు కప్పు (ఫ్రై చేసినవి)
తయారీ విధానం
మిక్సింగ్ గిన్నెలోకి చికెన్ తీసుకోండి. మొత్తం గరం మసాలాలు, అవసరమైనంత ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, వేయించిన ఉల్లిపాయలు, సగం నిమ్మకాయ, పెరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, నూనె వేసి బాగా కలపండి. మెరినేట్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి.
బియ్యాన్ని మెరినేట్ చేయడం..
మిక్సింగ్ గిన్నెలోకి పచ్చి బాస్మతి బియ్యాన్ని తీసుకోండి. దానిలో నూనె, ఉప్పు, మొత్తం గరం మసాలా మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి, ఎర్ర కారం, బిర్యానీ మసాలా, ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. పచ్చిమిర్చి, పుదీనా ఆకులు వేసి బాగా కలపాలి. ఒక గంట పాటు పక్కన పెట్టండి.
ఇప్పుడు వెదురు బొంగులు తీసుకుని.. లోపల దుమ్ము లేకుండా వెదురును శుభ్రం చేయండి. లోపలి భాగాన్ని నూనెతో గ్రీజ్ చేయండి. ఇప్పుడు కొంచెం చికెన్ వేయండి. తర్వాత 4 నుంచి 5 స్పూన్లు బియ్యం.. వేసి మళ్లీ చికెన్ వేయండి. ఇప్పుడు దానిలో 1 ¼ కప్పుల నీటిని వేయండి. ఖాళీల గుండా నీరు దిగువకు ప్రవహిస్తుంది. వెదురును అల్యూమినియం ఫాయిల్‌తో కప్పేయండి.
వెదురు బిర్యానీ చేయడం
నిప్పు పెట్టి దానిపై వెదురు పెట్టండి. మధ్యలో తిప్పుతూ 30 నుంచి 35 నిమిషాలు వదిలివేయండి. తర్వాత మంట నుంచి తీసివేసి 5 నుంచి 10 నిమిషాలు వదిలేయండి. దీనిని అరటి ఆకుపై వేడి వేడిగా వడ్డించండి.
సంబంధిత కథనం