తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Suji Halwa Recipe : న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ.. సూజీ హల్వా..

Suji Halwa Recipe : న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ.. సూజీ హల్వా..

30 December 2022, 7:29 IST

    • Suji Halwa Recipe : పండుగల సమయంలో.. ఏదైనా శుభకార్యాల సమయంలో ఇళ్లల్లో స్వీట్స్ చేస్తారు. అయితే వచ్చేది న్యూ ఇయర్. ఆ రోజు మీ ఉదయాన్ని ఏదైనా తీపితో ప్రారంభించాలి అంటే.. కచ్చితంగా ఈ సూజీ హల్వాను ట్రై చేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
సూజీ హల్వా
సూజీ హల్వా

సూజీ హల్వా

Suji Halwa Recipe : హల్వాను చాలా మంది ఇష్టపడతారు కానీ.. వారికి ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అయితే ఇంట్లోనే టేస్టీగా, సింపుల్​గా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీ ఏంటో ఇప్పుడు చుద్దాం. మీ కొత్త సంవత్సరాన్ని అద్భుతమైన రుచితో ప్రారంభించాలి అనుకుంటే.. కచ్చితంగా ఈ సూజీ హల్వాను ట్రై చేయాల్సిందే. మరి దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. దానిని ఎలా కుక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

కావాల్సిన పదార్థాలు

* సుజీ - 1 1/2 కప్పు

* బెల్లం - 3/4 కప్పు

* కుంకుమ పువ్వు - 3-4

* సోంపు - 1 టీస్పూన్

* నీరు - 2 1/2 కప్పు

* నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు

* పాలు - 1/2 కప్పు

* బాదం - 3 టీస్పూన్స్

* ఎండు ద్రాక్ష - 3 టీస్పూన్స్

* జీడిపప్పు - 3 టీస్పూన్స్

తయారీ విధానం

ముందుగా సూజీని నెయ్యిలో వేయించండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో కాస్త నెయ్యి వేసి.. సోంపు గింజలు వేయండి. అవి చిటపటలాడే వారకు వేయించి.. సూజి వేసేయండి. అది గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించండి. దానిని పక్కనపెట్టి.. ఇప్పుడు అదే పాన్​లో బెల్లం వేసి కరిగించండి. బెల్లం - నీళ్ల మిశ్రమం చిక్కబడేలా కొంత సమయం పాటు ఉడకనివ్వండి.

సుమారు 3 నుంచి 4 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించి.. ఆపై కుంకుమపువ్వు, పాలు వేయండి. అనంతరం సూజీ వేసి.. ఉడకనివ్వండి. అది చిక్కగా మారడం ప్రారంభించిన తర్వాత.. ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి. వేడిగా వేడిగా సర్వ్ చేసుకుని.. ఆనందించేయండి.

తదుపరి వ్యాసం