తెలుగు న్యూస్  /  Lifestyle  /   Meizu Mblu 10s Smartphone Launched That Got Iphone Design

Meizu mblu 10s । ఐఫోన్ మాదిరి డిజైన్‌తో మెయిజు నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

11 July 2022, 12:54 IST

    • చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Meizu తాజాగా Meizu mblu 10s అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆపిల్ ఐఫోన్‌ను పోలి ఉంది. మరి ధర ఎంతో తెలుసా? ఈ స్టోరీ చదవండి.
Meizu mblu 10s
Meizu mblu 10s

Meizu mblu 10s

ఎలాంటి ఫోన్ ను అయినా జిరాక్స్ తీసే టెక్నాలజీ చైనీస్ కంపెనీలకు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Meizu తాజాగా Meizu mblu 10s అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఆపిల్ ఐఫోన్‌ను పోలి ఉంది. అయితే ధర మాత్రం చాలా తక్కువ. వివిధ కాన్ఫిగరేషన్లలో వచ్చిన ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర మన భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 8,500 నుంచి ప్రారంభమవుతుంది. అయినప్పటికీ ఇందులో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Meizu mblu 10s అనేది ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌. దీని ముందుభాగంలో నాచ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెట్ ఇచ్చారు.

కొద్దిరోజుల కింద విడుదలైన LeTV Y1 Pro, జియోనీ జీ13 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్ కూడా ఐఫోన్13 లాగే ఉన్నాయి. ఈ మోడల్స్ ధరలైతే కేవలం రూ. 6 వేల నుంచే ప్రారంభమవుతున్నాయి. మరి Meizu mblu 10s స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇక్కడ చూడండి.

Meizu mblu 10s స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.52 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
  • 4GB/6GB RAM, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • యునిసోక్ T310 ప్రాసెసర్
  • వెనకవైపు 48MP+2MP+ 0.3MP ట్రిపుల్ కెమెరా సెట్, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

Meizu mblu 10sలో ఇంకా ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌, USB టైప్-C పోర్ట్, కోసం 3.5mm జాక్ ఉన్నాయి.ఈ ఫోన్ మ్యాజిక్ నైట్ బ్లాక్, స్ట్రీమర్ సిల్వర్, గ్రేట్ బే బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఫోన్ ఇండియాలో విడుదలవుతుందనే దానిపై సమాచారం లేదు. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేయాలనుకుంటే Suning అలాగే JD.com వంటి చైనీస్ రిటైలర్ సైట్‌లలో ఆర్డర్ కోసం ప్రయత్నించవచ్చు.

టాపిక్