తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iphone Tips | ఐ ఫోన్ లో ఈ యాప్స్‌తో జాగ్ర‌త్త‌..

iPhone tips | ఐ ఫోన్ లో ఈ యాప్స్‌తో జాగ్ర‌త్త‌..

HT Telugu Desk HT Telugu

07 July 2022, 23:19 IST

google News
    • మీరు ఐ ఫోన్ వాడుతున్నారా? అయితే, ఈ వార్త మీ కోస‌మే. ఐఫోన్‌లో ర‌హ‌స్య సెక్ష‌న్ ఒకటి ఉంది. అది చాలా ఉప‌యోగ‌క‌ర‌మైన సెక్ష‌న్‌. మీ డేటా సుర‌క్షితంగా ఉండాలంటే ఆ సెక్ష‌న్ గురించి తెల్సుకోవాల్సిందే.
ఐఫోన్
ఐఫోన్

ఐఫోన్

స‌మయానుసారంగా మ‌నం ఫోన్ల‌లో చాలా యాప్స్ నుఇన్‌స్టాల్ చేస్తుంటాం. ఆ యాప్‌తో అవ‌స‌రం తీరిపోయిన త‌రువాత కూడా దాన్ని అన్ఇన్‌స్టాల్ చేయం. కొన్ని యాప్స్‌ను మాత్రం రెగ్యుల‌ర్‌గా వాడుతూనే ఉంటాం. అయితే, ఏ యాప్స్ మ‌న‌కు డేంజ‌ర‌స్‌? మ‌న డేటాను ట్రాక్ చేసే యాప్స్ ఏంటి? అనే విష‌యాల్లో మ‌న‌కు అవ‌గాహ‌న త‌క్కువ‌.అయితే, గూగుల్‌, యాపిల్ ఇప్ప‌టికే యాప్ డెవ‌ల‌ప‌ర్స్‌కు ఒక వార్నింగ్ ఇచ్చాయి. యూజ‌ర్ల నుంచి సేక‌రించే స‌మాచారం ఏమిటో ముందే, ఆ యూజ‌ర్ల‌కు తెలియ‌జేయాల‌న్న‌ది యాపిల్‌, గూగుల్ సంస్థ‌లు యాప్ డెవ‌ల‌ప‌ర్స్‌కు పెట్టిన ష‌ర‌తులు.

iPhone tips | ఐ ఫోన్‌లో ఆ ఫెసిలిటీ

కానీ ఐ ఫోన్‌లో ఒక సౌక‌ర్యం ఉంది. సాధార‌ణంగానే ఐ ఫోన్ అంటే డేటా సెక్యూర్డ్ అని న‌మ్మ‌కం. అలాగే, ఐ ఫోన్‌లో ఒక ఆప్ష‌న్ ఉంది. ఆ ఆప్ష‌న్ ద్వారా ఫోన్‌లో మ‌న యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసే యాప్స్ ఏంటో తెలిసిపోతుంది. దాంతో, ఆ యాప్స్‌ను అన్ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఐ ఫోన్‌లో సీక్రెట్ సెక్ష‌న్ ఉంటుంది. అందులో మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసే యాప్స్ జాబితా ఉంటుంది. ఆ జాబితాలో ఉన్న యాప్స్‌లో అన‌వ‌స‌ర‌మైన యాప్స్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయొచ్చు.

iPhone tips | ప్రైవ‌సీకి భంగం

ఐ ఫోన్‌లోని అన్ని యాప్‌లు యూజ‌ర్ల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన అడ్వ‌ర్టైజ్‌మెంట్ ఐడీని ఇస్తాయి. మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేసే అనుమ‌తి మీరు ఇచ్చిన త‌రువాత‌, ఆ యాప్ మీ నెట్ బ్రౌజింగ్ హిస్ట‌రీ, వివిధ యాప్‌ల‌ వినియోగం స‌హా మీ ప్ర‌తీ యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. త‌ద్వారా మీ ఇష్టాల‌ను, అవ‌స‌రాల‌ను గుర్తించి, యాడ్స్‌ను ప్ర‌మోట్ చేస్తుంది. యాడ్స్ రావ‌డం వ‌ల్ల ప్ర‌మాదమేమీ ఉండ‌దు. కానీ అది కూడా ఒక ర‌కంగా మీ ప్రైవ‌సీని భంగం చేసిన‌ట్లే భావించాలి.

iPhone tips | ఎలా గుర్తించ‌డం?

ఏయే యాప్‌లు మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తున్నాయో ఇలా తెలుసుకోండి.

- ముందుగా మీ ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లండి

- త‌రువాత ప్రైవ‌సీ సెక్ష‌న్‌లోకి వెళ్లండి

- అక్క‌డ పైన `ట్రాకింగ్‌` అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి

- అక్క‌డ “ Allow Apps to Request to track” అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.

- దాని ప‌క్క‌న ఒక టాగిల్ బ‌ట‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి

- మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తున్న యాప్స్ జాబితా క‌నిపిస్తుంది.

- ఆ అన్ని యాప్స్‌ను కూడా మీ యాక్టివిటీస్‌ను ట్రాక్ చేయ‌కుండా నిషేధించ‌వ‌చ్చు. అందుకు `Allow Apps to track` ను ట‌ర్న్ ఆఫ్ చేయండి.

- లేదా ఆ జాబితాలో కొన్ని యాప్స్‌ను మాత్ర‌మే డిసేబుల్ చేసుకోవాల‌నుకున్నా.. చేసుకోవ‌చ్చు.

తదుపరి వ్యాసం