తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Superfoods: అద్భుత ప్రయోజనాలు ఇచ్చే 10 వింటర్ సూపర్‌ఫుడ్స్ ఇవే

Winter Superfoods: అద్భుత ప్రయోజనాలు ఇచ్చే 10 వింటర్ సూపర్‌ఫుడ్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

17 January 2023, 12:06 IST

    • Winter Superfoods: వింటర్ సీజన్‌లో లభించే 10 సూపర్ ఫుడ్స్ అనేక దీర్ఘకాల వ్యాధులకు కూడా ఉపశమనం ఇస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వింటర్ సూపర్ ఫుడ్స్‌లో క్యాలిఫ్లవర్ కూడా ఒకటి
వింటర్ సూపర్ ఫుడ్స్‌లో క్యాలిఫ్లవర్ కూడా ఒకటి (Shilpa Thakur)

వింటర్ సూపర్ ఫుడ్స్‌లో క్యాలిఫ్లవర్ కూడా ఒకటి

Winter Superfoods: సూపర్ ఫుడ్ అంటే పోషకాలతో కూడిన ఆహారమే. దండిగా విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటాక్సిడంట్లు ఉండేవన్నట్టు. అవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎక్కువగా ఇవి మొక్కల ఆధారిత ఆహారంలోనే లభిస్తాయి. అయితే కొన్నిసార్లు పాల ఉత్పత్తులు, చేపలు వంటి వాటిలో లభిస్తాయి. వింటర్‌లో లభించే 10 సూపర్ ఫుడ్స్ ఇక్కడ చదవండి

ట్రెండింగ్ వార్తలు

Chicken Biryani: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? దాంతో ఇలా చికెన్ బిర్యానీ వండేయండి, కొత్తగా టేస్టీగా ఉంటుంది

Parenting Tips : పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన విషయాలు ఇవి

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

అత్యుత్తమ వింటర్ సూపర్ ఫుడ్స్

1. చిలగడ దుంప

చిలగడ దుంపనే కొన్ని ప్రాంతాల్లో కంద గడ్డగా కూడా పిలుస్తారు. నిజానికి కంద గడ్డ వేరే. ఇంగ్లీష్‌లో అయితే స్వీట్ పొటాటోగా పిలుస్తారు. ఈ చిలగడ దుంప నిండా విటమిన్ ఏ ఉంటుంది. ఇది మీ రోగ నిరోధకతను ఇట్టే పెంచుతుంది. అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియ సమస్యలను నివారిస్తుంది.

2. క్యారెట్లు

ఫైబర్, విటమిన్ కె1, విటమిన్ ఏ, యాంటాక్సిడంట్లు పుష్కలంగా ఉండే క్యారెట్లు వింటర్ సూపర్ ఫుడ్‌గా ప్రాచుర్యంలో ఉంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

3. దానిమ్మ

వింటర్‌లో దానిమ్మ సూపర్ ఫుడ్‌గా పనిచేస్తుంది. అమితమైన యాంటాక్సిడంట్లు, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని కణాల స్వరూపం పటిష్టంగా ఉండడానికి ఉపయోగపడుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటాక్సిడంట్లు క్యాన్సర్‌ను నిరోధించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతాయి.

4. ఎరుపు రంగు క్యాబేజీ

ఎరుపు రంగులో ఉండే క్యాబేజీలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. రక్తం అవసరమైన చోట గడ్డకట్టడానికి విటమిన్ కే ఉపయోగపడుతుంది. ఈ ఎరుపు రంగు క్యాబేజీలో మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఎముకల పటిష్టతకు దోహదపడుతాయి.

5. ఎరుపు రంగు ముల్లంగి

ఎరుపు రంగులో ఉండే ముల్లంగి కూడా అనేక యాంటాక్సిడంట్లను కలిగి ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లను నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

6. చిన్న కమలాలు

టాంజరిన్స్ అనే ఆరేంజ్ రకం చిన్నవిగా ఉంటాయి. గాఢమైన ఎరుపు-ఆరేంజ్ కలర్‌లో ఉంటాయి. రెగ్యులర్ ఆరేంజెస్ కంటే తీయగా ఉంటాయి. కమలాలతో పోలిస్తే మృదువుగా ఉంటాయి. వింటర్‌లో పుష్కలంగా లభించే ఈ టాంజరిన్స్‌లో విటమిన్ సీ, విటమిన్ ఏ, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. వీటి పుష్కలంగా యాంటాక్సిడంట్లు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల నుంచి ఇవి కాపాడుతాయి.

7. బీట్‌రూట్

వింటర్‌లో బీట్ రూట్ తినడం మరిచిపోవద్దు. పొటాషియం, ఐరన్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. రక్తశుద్ధికి, రక్త ప్రవాహానికి ఉపయోగపడతాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇందులో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్త ప్రవాహాన్ని పెంచి కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

8. మష్రూమ్స్ (పుట్టగొడుగులు)

బయట దొరికేవైనా, ఇంట్లో పెంచినా వింటర్ సీజన్‌లో మష్రూమ్ సూపర్‌ఫుడ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది క్యాన్సర్ రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. విటమిన్ డీ దొరికే ఆహారాల్లో ఇదొకటి. సూర్యరశ్మి సోకితే ఈ పుట్టగొడుగులు విటమిన్ డీ కంటెంట్‌ను మనకు ఎక్కువగా ఇస్తాయి.

9. క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్ కూడా వింటర్ సూపర్ ఫుడ్. వింటర్‌ సీజన్‌లో ఎక్కువగా లభిస్తుంది. గుండెకు మేలు చేసే యాంటాక్సిడంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి. మన మూడ్‌ను రెగ్యులేట్ చేసే కొలైన్ అనే పోషకం కూడా ఇందులో ఉంటుంది.

10. ఆకుతో కూడిన ఉల్లి (స్ప్రింగ్ ఆనియన్స్)

ఉల్లి ఆకు అనేక కూరల్లో వాడుతాము. ఉల్లి లేతగా ఉన్నప్పుడు ఇచ్చే గడ్డను స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం. వీటిలో క్యాన్సర్‌‌ను నయం చేసే గుణం కూడా ఉంది. అమితమైన యాంటాక్సిడంట్లు, ఫ్లేవనాయిడ్లు ఇందుకు ఉపయోగపడతాయి.