immunity boosters: వింటర్ జబ్బుల నుంచి రక్షణకు 5 ఇమ్యూనిటీ ఫుడ్స్-know these 5 foods to consume in winter to avoid cold and cough ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Immunity Boosters: వింటర్ జబ్బుల నుంచి రక్షణకు 5 ఇమ్యూనిటీ ఫుడ్స్

immunity boosters: వింటర్ జబ్బుల నుంచి రక్షణకు 5 ఇమ్యూనిటీ ఫుడ్స్

HT Telugu Desk HT Telugu
Published Jan 16, 2023 09:01 PM IST

immunity boosters: వింటర్ సీజన్‌లో ఎదురయ్యే జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షణకు 5 ఇమ్యూనిటీ ఫుడ్స్ ఇవే.

వింటర్ సీజన్‌లో ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ ఇవే
వింటర్ సీజన్‌లో ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్స్ ఇవే

ఫ్లూ, కోవిడ్, తదితర వైరల్ ఇన్ఫెక్షన్లలో జలుబు, దగ్గు సర్వసాధారణం. వింటర్ సీజన్ అయితే వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. తరచుగా మీరు జబ్బు పడుతున్నట్టయితే, శక్తివిహీనంగా మారుతున్నట్టయితే మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవసరం. వింటర్ అంటేనే అనారోగ్యాలు దరి చేరే కాలం. అయితే ఈ కాలంలో శరీరానికి అవసరమైన సూపర్ ఫుడ్స్ లభిస్తాయి. పాలకూర, ఆవాకు, ఉసిరి, కమలాలు వంటివి రోగ నిరోధకతను పెంచుతాయి. ఇన్ఫెక్షన్లకు రక్షణగా నిలుస్తాయి. చలికాలంలో మన నోరు ఊరుకోదు. ఏదో ఒకటి నమలాలనిపిస్తుంటుంది. జంక్ ఫుడ్‌కు బదులు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటే మీరు చలికాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు.

‘జలుబు, దగ్గు కాలంలో అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే మేలు. మంచి పోషకాహారం, వ్యాయామం, తగిన నిద్ర వైరస్, బ్యాక్టీరియాతో పోరాడేందుకు సహకరిస్తాయి..’ అని న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా వివరించారు. జలుబు, దగ్గు నివారణకు తినాల్సిన ఆహారం సూచించారు.

వెల్లుల్లి

వెల్లుల్లి సహజ యాంటీబ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంది. అలిసిన్ అనే మిశ్రమం ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

పసుపు పాలు

జలుబుకు హోమ్ రెమెడీగా పసుపు పాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇది రోగ నిరోధకతను పెంచుతుంది. దీనికి మిరియాలు కూడా జత చేస్తే తక్షణ ఫలితాలు కనిపిస్తాయి.

తులసి

సహజ ఇమ్యూనిటీ బూస్టర్‌గా తులసి అద్భుతాలు చేస్తుంది. ఇన్ఫెక్షన్లను తరిమికొడుతుంది.

బాదాం

విటమిన్ ఇ అధికంగా ఉన్న ఫుడ్ బాదాం. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, దగ్గు సమయంలో ప్రయోజనకారిగా ఉండే జింక్ దీనిలో ఉంటుంది.

ఉసిరి

ఉసిరి కాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న ఈ ఇమ్యూనిటి బూస్టర్ వింటర్ సీజన్‌లో చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

Whats_app_banner