తెలుగు న్యూస్  /  Lifestyle  /  Iphone 13 Orders On Flip Kart Are Cancelled Without Information In Flipkart Big Billion Days Sale 2022

Flipkart Big Billion Days Sale 2022 : iPhone 13 ఆర్డర్​లు క్యాన్సిల్.. ఎందుకంటే

27 September 2022, 9:58 IST

    • Flipkart Big Billion Days Sale 2022 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్​లో భాగంగా.. ఐఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. చాలామంది వాటి కొనేందుకు ఎగబడ్డారు. అయితే తాజాగా… ఫ్లిప్ట్ కార్ట్ ఐఫోన్ 13 ఆర్డర్​ను.. ఎటువంటి వివరణ లేకుండా క్యాన్సిల్ చేసేసింది.
ఐ ఫోన్ 13 ఆర్డర్లు క్యాన్సిల్
ఐ ఫోన్ 13 ఆర్డర్లు క్యాన్సిల్

ఐ ఫోన్ 13 ఆర్డర్లు క్యాన్సిల్

Flipkart Big Billion Days Sale 2022 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో.. Apple iPhone 13 అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. విక్రయం ప్రారంభమైన తొలి రోజుల్లో.. మాజీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 50,000లోపు అందుబాటులో ఉంది. అమ్మకానికి వచ్చిన కొన్ని రోజులలో ఐఫోన్ 13 ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ధర పెంపును పొందించింది. అయితే రెండు రోజులుగా.. బిగ్ బిలియన్ డే సేల్ 2022 సందర్భంగా తాము ఆర్డర్ చేసిన Apple iPhone 13ని అందుకోలేకపోయినందుకు Flipkart వినియోగదారులు ట్విట్టర్‌లో తమ నిరాశను వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Heart health and Diabetes : మధుమేహం ఉన్నవారు కార్డియాక్ అరెస్ట్‌ను ఎలా ఎదుర్కోవచ్చు?

Bank Account : చనిపోయిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం ఎలా?

Curd Face Packs : వీటితో కలిపి పెరుగు ఫేస్ ప్యాక్ తయారుచేస్తే మీ ముఖం మెరిసిపోతుంది

Beetroot Palya Recipe : అన్నం, చపాతీలోకి బీట్‌రూట్ పల్యా రెసిపీ.. గట్టిగా లాగించేయెుచ్చు

బాధిత కస్టమర్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు. "A Big Billion Day Sale సమయంలో iPhone 13ని బుక్ చేశాను. దాని కోసం ఆసక్తిగా ఎదురుచూశాను. కానీ ఎటువంటి వివరణ లేకుండా ఉత్పత్తిని విక్రేత/Flipkart రద్దు చేశారు". అంటూ వాపోయాడు.

మరో iPhone 13 కొనుగోలుదారు ఇలా అన్నాడు. "ఈ ఆర్డర్ నిన్న షిప్పింగ్ చేశారు. ఈ రోజు డెలివరీ కావాలి. కానీ నా సమ్మతి లేకుండా చివరి నిమిషంలో అది రద్దు చేశారు". అంటూ ట్వీట్ చేశాడు.

వీటి తర్వాత ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో "అక్రమాల కారణంగా" విక్రేతలు కొన్ని ఆర్డర్‌లను రద్దు చేసినట్లు అంగీకరించారు. కంపెనీ ఒక ప్రకటనలో "అక్రమాల కారణంగా అమ్మకందారులచే ఆర్డర్‌లలో చిన్న భాగం (మొత్తం ఆర్డర్‌లలో 3 శాతం కంటే తక్కువ) ఐఫోన్లు రద్దు చేశారు" అని తెలిపింది.

"కస్టమర్-ఫోకస్డ్ ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా.. కస్టమర్‌ల ఆర్డర్‌లకు ప్రాధాన్యత ఇవ్వమని, వారి సేవలతో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తామని.. ఆ విధంగా విక్రేతలను ప్రోత్సహిస్తున్నాము" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ "గుంటూరు, గోరఖ్‌పూర్, సిలిగురితో సహా పలు నగరాల్లో అన్ని ఐఫోన్ ఆర్డర్‌లలో దాదాపు 70 శాతం అమ్మకందారులచే విజయవంతంగా డెలివరీ చేశామని" తెలిపింది.

దేశంలో పండుగ విక్రయాల సమయంలో ఐఫోన్‌లను కొనుగోలు చేయడానికి రద్దీ ఉంది. కొత్తగా ప్రారంభించిన iPhone 14, 14 Pro కాకుండా iPhone 13 అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. దాని తదుపరి తరం ఉత్పత్తులను ఆవిష్కరించిన తర్వాత.. టెక్ దిగ్గజం Apple iPhone 11, 12 Mini, 13 Pro, 13 Pro Maxతో సహా పాత ఐఫోన్‌లను నిలిపివేసింది.