తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Infinix Note 12 Pro । ప్రీమియం ఫీచర్లతో 5g సిరీస్‌ను విడుదల చేసిన ఇన్ఫినిక్స్!

Infinix Note 12 Pro । ప్రీమియం ఫీచర్లతో 5G సిరీస్‌ను విడుదల చేసిన ఇన్ఫినిక్స్!

HT Telugu Desk HT Telugu

10 July 2022, 14:58 IST

    • ఇన్ఫినిక్స్ కంపెనీ తాజాగా Note 12 5G సిరీస్ ను పరిచయం చేసింది. Infinix Note 12 , Infinix Note 12 Pro అనే రెండు 5G స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Infinix Note 12 Pro
Infinix Note 12 Pro

Infinix Note 12 Pro

మొబైల్ తయారీదారు ఇన్ఫినిక్స్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త Note 12 5G సిరీస్ ను పరిచయం చేసింది. ఇందులో భాగంగా Infinix Note 12 , Infinix Note 12 Pro అనే రెండు 5G స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఫీచర్లపరంగా ఈ రెండు ఫోన్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ, కాన్ఫిగరేషన్ విషయంలో ప్రో మోడల్ ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. జూలై 15 నుంచి Flipkart అలాగే Infinix అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Green Dosa: కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ దోశ చేశారంటే ఎంతో హెల్తీ, రెసిపీ ఇదిగో

World laughter day 2024: మూతి ముడుచుకుంటే వచ్చేదేం లేదు, ప్రతిరోజూ నవ్వండి నవ్వించండి, ఎక్కువకాలం జీవిస్తారు

Weight Loss Drink : ఇంట్లో తయారుచేసిన డ్రింక్.. ఈజీగా బరువు తగ్గవచ్చు

Beauty Tips : యవ్వనంగా కనిపించేందుకు కలబంద, వేప ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

ధరలను పరిశీలిస్తే బేస్ వేరియంట్ Infinix Note 12, 6GB/64GB మోడల్ ధర రూ. 14,999/- గా నిర్ణయించగా, టాప్ మోడల్ Infinix Note 12 Pro, 8GB/128GB మోడల్ 17,999/- గా ఉంది.

మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ఆ వివరాలను ఇక్కడ కింద పేర్కొన్నాం.

Infinix Note 12 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
  • 8 GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్
  • వెనకవైపు 108MP+ 2MP+ 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 33 W ఛార్జర్

ఇంకా DTS సరౌండ్ సౌండ్‌తో స్టీరియో స్పీకర్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. ఈ ఫోన్ 12 5G బ్యాండ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది స్నోఫాల్ వైట్, ఫోర్స్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

టాపిక్