తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Infinix Hot 12 Play | మరొక ఎంట్రీలెవెల్ ఫోన్.. శక్తివంతమైన బ్యాటరీతో!

Infinix Hot 12 Play | మరొక ఎంట్రీలెవెల్ ఫోన్.. శక్తివంతమైన బ్యాటరీతో!

HT Telugu Desk HT Telugu

24 May 2022, 19:12 IST

    • ఇన్ఫినిక్స్ కంపెనీ తక్కువ ధరకే మరో ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ 'Infinix హాట్ 12 ప్లే'ను విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Infinix Hot 12 Play
Infinix Hot 12 Play

Infinix Hot 12 Play

మొబైల్ తయారీదారు ఇన్ఫినిక్స్ తమ Infinix Hot 12 సిరీస్‌ను విస్తరిస్తూ మరొక స్మార్ట్‌ఫోన్ Hot 12 Playను జాబితాలో చేర్చింది. తాజాగా భారత మార్కెట్లో విడుదల అయిన ఈ ఎంట్రీలెవెల్ ఫోన్ రూ. 9 వేల బడ్జెట్ ధరలోనే లభించనుంది. మే 30 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుదారులకి అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రేసింగ్ బ్లాక్, హారిజన్ బ్లూ, షాంపైన్ గోల్డ్, డేలైట్ గ్రీన్ వంటి నాలుగు కలర్ ఛాయిస్ లలో ఎంచుకోవచ్చు.

ఇందులో బ్యాటరీ, డిస్‌ప్లే గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ప్రీమియం రేంజ్ ఫోన్లలో ఇచ్చినట్లుగా Infinix Hot 12 Play పెద్ద HD+ స్క్రీన్ ఇచ్చారు, రక్షణగా Panda MN228 glass స్క్రీన్ గార్డ్ కూడా వస్తుంది. అలాగే ఎక్కువకాలం బ్యాకప్ ఇచ్చే 6000 mAh బ్యాటరీ అందిస్తున్నారు.

ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అసలు ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం.

Infinix Hot 12 Play స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.82 అంగుళాల IPS LCD డిస్‌ప్లే

4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

యూనిసాక్ T610 ప్రాసెసర్

వెనకవైపు 13+2 మెగా పిక్సెల్ AI కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్

ధర రూ. 8,499/-

కనెక్టివిటీ పరంగా Infinix Hot 12 Playలో 4G, Wi-Fi 802.11 a/b/g/n, GPS, బ్లూటూత్ v5.00, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. సెన్సార్‌లను పరిశీలిస్తే యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్/మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం