తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stay Positive | జీవితంలో పాజిటివ్​గా ఉండాలంటే.. వారికి దగ్గరగా ఉండండి..

Stay Positive | జీవితంలో పాజిటివ్​గా ఉండాలంటే.. వారికి దగ్గరగా ఉండండి..

HT Telugu Desk HT Telugu

06 May 2022, 10:38 IST

    • లైఫ్​లో పాజిటివ్​గా ఉండడం చాలా ముఖ్యం. ఇలా ఉండాలంటే.. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవాలి. మిమ్మల్ని పాజిటివ్​గా ఉంచే వారితో సన్నిహితంగా ఉండడం వల్ల మీలో సానుకూలత పెరుగుతుంది. అయితే ఎలాంటి వారికి దగ్గరగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాజిటివ్​గా ఉండండి..
పాజిటివ్​గా ఉండండి..

పాజిటివ్​గా ఉండండి..

మీ జీవితంలో మీ శక్తిని, సానుకూలతలను పీల్చుకునే రక్త పిశాచులు ఉండే ఉంటారు. వారు మిమ్మల్ని తక్కువ చేసి.. మీరు నెగిటివ్​గా ఉండేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో మీకు మంచి సావాసం అవసరం. మీలో సానుకూలతలను పెంచే వ్యక్తులు మీకు తెలిసే ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించంది. వారు మీలో పాజిటివిటీని పెంచి.. మీరు ఉత్తమంగా ఉండేలా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, కొత్త విషయాలకు బహిర్గతం చేయడానికి లేదా మిమ్మల్ని తేలికగా అనుభూతి చెందేలా వీలు కల్పిస్తారని థెరపిస్ట్​లు చెప్తున్నారు.

వారిని ప్రశ్నలు అడగండి..

మీ కంటే మెరుగైన, గొప్పగా ఉండే వారు.. మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తులకు దగ్గరగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు జీవితంలో ఎలా ప్రయాణిస్తున్నారు, ఒడిదొడుకులను తట్టుకుని పాజిటివ్​గా ఎలా ముందుకు సాగుతున్నారు అనే ప్రశ్నలు అడిగిందేకు వెనుకాడొద్దు అంటున్నారు.

మనసు తేలికపడేలా చేస్తారు..

వారితో ఉంటే మీ మనసు తేలికగా ఉంటుంది అనిపించే వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి. మీతో మాట్లాడుతూ సులభంగా మీ మనసులోని బరువును తీసివేసే వ్యక్తులతో సమయం గడపడం వల్ల మీరు సంతోషంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మిమ్మల్ని, మీ సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తులతో సన్నిహితంగా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మీ కష్టంలో తోడుండి.. వెన్నుతట్టే వారు మీకు అవసరమని తెలిపారు.

కొత్త విషయాలు బహిర్గతం చేస్తారు..

మీ గురించి, ప్రపంచం గురించి మీకు కొత్త విషయాలను బహిర్గతం చేసే వ్యక్తులు కూడా విలువైనవారే. ప్రతి ఒక్కరూ మీలాగే ఉంటే.. మీ కంటే భిన్నమైన వారిని అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి విభిన్నమైన స్నేహితులను కలిగి ఉండటం మీకు మంచిది. మీ అనుభవాలు భిన్నంగా ఉన్నప్పటికీ కలిసి ఉండడం అర్థవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకునే సౌలభ్యం ఉంటుందని పేర్కొంటున్నారు.

అవి అంటువ్యాధుల వంటివే..

ఆరోగ్యకరమైన హద్దులను రూపొందించే వ్యక్తులకు దగ్గరగా ఉండటం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రవర్తనలు అంటువ్యాధిలా మారుతాయి. ఇవి తనను తాను మెరుగుపరచుకునేలా చేస్తాయి. మీ ఆలోచనలను సవాలు చేసే వ్యక్తులను దగ్గరగా ఉండాలని.. ఎందుకంటే వారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేయడంలో ఏ మాత్రం వెనుకాడరు.

టాపిక్