తెలుగు న్యూస్  /  Lifestyle  /  How To Make Herbal Bath Powder At Home Easily

Herbal bath powder: హెర్బల్ బాత్ పౌడర్ ఇంట్లోనే చేసుకుంటే.. ఇక సబ్బు అవసరం లేదు..

HT Telugu Desk HT Telugu

04 June 2023, 16:41 IST

  • Herbal bath powder: సబ్బుకు బదులుగా ఎలాంటి రసాయనాలు లేని హెర్బల్ బాత్ పౌడర్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేయండి..

హెర్బల్ బాతింగ్ పౌడర్
హెర్బల్ బాతింగ్ పౌడర్ (freepik)

హెర్బల్ బాతింగ్ పౌడర్

వేసవిలో చర్మం చల్లగా ఉండేలా చూసుకోవడం, ట్యాన్ నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం. మిగతా కాలాల్లో కూడా చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. అయితే సబ్బుకు బదులుగా ఒకసారి హెర్బల్ బాత్ పౌడర్ ప్రయత్నించి చూడండి. ఎలాంటి రసాయనాలు లేని ఆయుర్వేద గుణాలున్న ఈ పొడిని వాడటం వల్ల చర్మానికి చల్లదనం, ఆరోగ్యం. రెండు పద్ధతుల్లో హెర్బల్ బాత్ పౌడర్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం.

హెర్బల్ బాత్ పౌడర్ కోసం ఏమేం కావాలంటే..

చందనం పొడి

తులసి పొడి

వేప పొడి

పసుపు

గులాబీ రెక్కల పొడి

అతిమధురం

రోజ్ వాటర్

ఎలా తయారు చేయాలి?

అన్ని పొడులను కలుపుకోవాలి. ప్రతిరోజూ కలుపుకోవడం వీలు కాదు కాబట్టి ఒక వారానికి సరిపడా ఒకేసరి కలిపి పెట్టుకోవచ్చు. స్నానం చేసే కన్నా ముందు అన్నీ పొడులు కలిపిన మిశ్రమాన్ని రెండు మూడు చెంచాలు తీసుకోవాలి. దాంట్లో రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. సబ్బుకు బదులుగా పూర్తిగా దీన్నే వాడొచ్చు.

ఇదెలా పనిచేస్తుంది?

చందనంలో ఉండే చల్లదనం, వేప, పసుసు, తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, గులాబీకి ఉన్న సాంత్వన నిచ్చే గుణం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వేసవిలో చర్మం ట్యాన్ అవ్వకుండా కాపాడతాయి. సూర్యుని నుంచి చర్మానికి రక్షణ దొరుకుతుంది. చల్లదనం ఇచ్చే కూలింగ్ సబ్బుల వల్ల కేవలం బయటి శరీరానికే చల్లదనం దొరుకుతుంది. దీనివల్ల మనకు అసలైన చల్లదనం సాంత్వన దొరుకుతుంది. జిడ్డు, యాక్నె లాంటి సమస్యలు కూడా ఈ బాతింగ్ పౌడర్ వల్ల తగ్గిపోతాయి.

ఇంకో పద్ధతి..

శనగపిండి

చందనం పొడి

గులాబీ రేకుల పొడి

లాభాలు:

ఈ పొడులన్నీ కలిపి మామూలు నీటితో ముద్దలాగా చేసుకుని శరీరానికి రాసుకోవాలి. తరువాత సబ్బు వాడాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన పొడులన్నీ కూడా ముందుగానే కలిపి కొన్ని రోజులకు సరిపడా సిద్దం చేసి పెట్టుకోవచ్చు.

శనగపిండి వల్ల ఎండవల్ల రంగు మారిన చర్మం మామూలు రంగులోకి వచ్చేస్తుంది. ఒక డి ట్యాన్ ఏజెంట్ లాగా ఇది పనిచేస్తుంది. శరీరాన్ని మృదువుగా మారుస్తుంది.

చందనం పొడికున్న యాంటీబయాటిక్ గుణాల వల్ల యాక్నె తగ్గుతుంది. చర్మంమీద ఉన్న మృతకణాలు తొలిగిపోతాయి. చర్మం తేమగా మారుతుంది.

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల యాక్నె, యాక్నె తాలూకు మచ్చలు, నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.