తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Made Hair Pack : విపరీతంగా జుట్టు రాలుతుందా? కొబ్బరినూనె, జీలకర్ర ఇలా వాడండి

Home Made Hair Pack : విపరీతంగా జుట్టు రాలుతుందా? కొబ్బరినూనె, జీలకర్ర ఇలా వాడండి

HT Telugu Desk HT Telugu

24 July 2023, 17:00 IST

google News
    • Home Made Hair Pack For Hair Loss : మీకు జుట్టు రాలుతుందా? పొడి జుట్టు, బట్టతల తల ఉందా? జుట్టు సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆందోళన చెందుతారు. అందంగా కనిపించేలా చేయడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి.. మీ జుట్టును కాపాడుకోవచ్చు.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె (unsplash)

కొబ్బరి నూనె

జుట్టు రాలడం(Hair Loss) సమస్య నుంచి బయటపడేందుకు వివిధ పద్ధతులను ప్రయత్నించి విసిగిపోయారా? డోంట్ వర్రీ.. మీ కోసం ఓ సరైన పరిష్కారం ఉంది. కొబ్బరి నూనె, జీలకర్ర గింజలు(Coconut Oil-Jeera) ఉపయోగించి హెయిర్ ప్యాక్‌ తయారు చేసి.. మీ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ నేచురల్ రెమెడీ జుట్టు రాలడాన్ని(Natural Remedy For Hair loss) అడ్డుకుంటుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనె, జీలకర్ర హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కొబ్బరి నూనె(Coconut Oil)లో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరగడానికి, బలోపేతం చేయడానికి ఈ నూనె శతాబ్దాలుగా ఉపయోగించబడింది. ఇది జుట్టు మూలాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి, జుట్టు పెరుగుదలను(Hair Growth) ప్రోత్సహిస్తుంది. జుట్టు విరిగిపోకుండా చేస్తుంది.

జీలకర్రలో అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మీ జుట్టుకు అద్భుతాలు చేస్తుంది. జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచే, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది.

కొబ్బరి నూనె, జీలకర్ర హెయిర్ ప్యాక్

Coconut Oil and Jeera Hair Pack : ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. దానికి 1 టీస్పూన్ జీలకర్ర పొడిని కలపండి. కాసేపు దీనిని వేడి చేయండి. తరువాత చల్లబరచాలి. మీ తలపై, జుట్టు మీద నూనె కొంచెం వేడి ఉన్నప్పుడు అప్లై చేయాలి. 5-10 నిమిషాల పాటు మీ స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో గోరువెచ్చని నీటితో మీ జుట్టును బాగా కడగాలి. దీనిద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

కొబ్బరి నూనె, జీలకర్ర స్కాల్ప్‌ను పోషించడానికి కలిసి పనిచేస్తాయి. జుట్టు పెరుగుదలను(Hair Growth) ప్రోత్సహించే అవసరమైన పోషకాలను అందిస్తాయి. కొబ్బరి, జీలకర్ర కలయిక జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడం, విరిగిపోవడాన్ని తగ్గిస్తుంది. హెయిర్ ప్యాక్‌(Hair Pack)ని మీ స్కాల్ప్‌కి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు మూలాలకు మెరుగైన పోషకాల సరఫరా జరుగుతుంది.

హెయిర్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు మెరుపు వస్తుంది. ఆరోగ్యకరమైన, మరింత సిల్కీ జుట్టును ఇస్తుంది. కొబ్బరి నూనె, జీలకర్ర రెండూ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చుండ్రు(Dandruff)ని తగ్గించడంలో, తలకు ఉన్న దురద నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.

తదుపరి వ్యాసం