DIY Monsoon Hair Packs। వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యం కోసం ఈ హెయిర్ ప్యాక్‌లు ట్రై చేయండి!-diy hair packs to nourish your hair naturally during rainy monsoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Monsoon Hair Packs। వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యం కోసం ఈ హెయిర్ ప్యాక్‌లు ట్రై చేయండి!

DIY Monsoon Hair Packs। వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యం కోసం ఈ హెయిర్ ప్యాక్‌లు ట్రై చేయండి!

HT Telugu Desk HT Telugu
Jul 22, 2023 08:08 AM IST

DIY Monsoon Hair Packs: ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నప్పుడు మీ ట్రెస్‌లు నిస్తేజంగా, గజిబిజిగా కనిపిస్తాయి. వర్షాకాలంలో మీ జుట్టు సమస్యలకు ఇక్కడ సూచించిన కొన్ని హెయిర్ ప్యాక్‌లను ప్రయత్నించండి.

DIY Monsoon Hair Packs
DIY Monsoon Hair Packs (istock)

DIY hair packs for monsoon: వర్షాకాలంలో వాతావరణంలోని అధిక తేమ స్థాయిల కారణంగా జుట్టు చిట్లిపోవడం, చిక్కులుపడటం. అంతేకాకుండా ఈ తేమతో కూడిన పరిస్థితులు మీ తలలో బ్యాక్టీరియా, శిలీంధ్రాల వృద్ధిని పెంచగలవు. మీకు తెలియకుండానే ఒక్కసారిగా చుండ్రు, ఇతర జుట్టు సమస్యలు వచ్చిపడతాయి. స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు కూడా మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. ఇవన్నీ జుట్టు నిర్జీవంగా మారడానికి, వెంట్రుకలు రాలిపోవడానికి దారితీస్తాయి. మీరు కూడా ఈ వర్షాకాలంలో మీ జుట్టు సంరక్షణ కోసం ఆందోళన చెందుతుంటే, పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొన్ని ఇంటి నివారణలపై ఆధారపడవచ్చు. వర్షాకాలం కోసం ఇంట్లో తయారుచేసిన కొన్ని హెయిర్ ప్యాక్‌లను ప్రయత్నించండి. హెయిర్ ప్యాక్‌లు మీ జుట్టును, స్కాల్ప్‌‌ను శుభ్రంగా ఉంచుతాయి. మీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా సహాయపడతాయి.

ఈ వర్షాకాలంలో ఎలాంటి హెయిర్ ప్యాక్‌లు పని చేస్తాయో బ్లాసమ్ కొచర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్‌పర్సన్ డాక్టర్ బ్లోసమ్ కొచర్‌ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు వివరించారు. ఈ మేరకు మీ స్వంతంగా ఇంట్లోనే చేసుకోగలిగే (homemade) కొన్ని హెయిర్ ప్యాక్‌ల రెసిపీలు (DIY Hair Packs recipes) పంచుకున్నారు. వాటినే మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం‌.

అరటిపండు- కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్‌

కొబ్బరి నూనె, అరటిపండును హెయిర్ ప్యాక్‌ (DIY Banana Coconut oil Hair Pack) చేయడానికి, ముందుగా కొబ్బరినూనెను వేడెచేసి, అందులో పండిన అరటిపండును వేసి మెత్తని పేస్ట్ చేయాలి. దీన్ని మీ జుట్టుకు వర్తించండి, మూలాలపై కాకుండా జుట్టు చివర్లపై దృష్టి పెట్టండి. 30 నిమిషాల నుండి గంట వరకు అలాగే ఉంచి, సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. తేలికపాటి షాంపూ ఉపయోగించండి. వర్షాకాలంలో ఈ హెయిర్ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లడం తగ్గడంతో పాటు, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు.

అలోవెరా జెల్ హెయిర్ ప్యాక్‌

ఇది ఒకే రకమైన హెయిర్ ప్యాక్ (DIY aloe vera Hair Pack), దీని కోసం మీరు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. కేవలం తాజాగా సేకరించిన అలోవెరా జెల్ తీసుకోవాలి. దానిని స్కాల్ప్, జుట్టుపై మంచి పరిమాణంలో వర్తించండి. 30 నిమిషాలు అలాగే ఉండనివ్వండి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. మీరు వారానికి ఒకసారి కలబంద జెల్ హెయిర్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు, ఇది మీ జుట్టును మృదువుగా, మెరిసేలా బలంగా మార్చుతుంది.

అలోవెరా జెల్, నిమ్మ టీ ట్రీ ఆయిల్ హెయిర్ ప్యాక్‌

DIY lemon tea tree oil hair pack: తాజాగా సేకరించిన అలోవెరా జెల్, ఒక టీస్పూన్ నిమ్మరసం, 3 నుండి 4 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోండి. ఈ మిశ్రమం మీ జుట్టుకు తాజాదనంను అందిస్తుంది, స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కలబంద హైడ్రేటింగ్ లక్షణాలు మీ జుట్టుకు తేమ, ప్రకాశాన్ని పునరుద్ధరిస్తాయి, నిమ్మకాయలోని సహజ ఆమ్లత్వం జిడ్డును సమతుల్యం చేస్తుంది. టీ ట్రీ యాంటీమైక్రోబయల్ లక్షణాలు చుండ్రుతో పోరాడుతాయి, మీ ట్రెస్‌లను శుభ్రపరుస్తాయి, రిఫ్రెష్‌గా ఉంచుతాయి.

అవోకాడో ఆలివ్ నూనె హెయిర్ ప్యాక్‌

DIY avocado olive oil Hair Pack: పండిన అవకాడోను మెత్తగా చేసి, ఒక చెంచా వెచ్చని ఆలివ్ నూనెను జోడించి, తడి జుట్టుకు అప్లై చేయండి. 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అవోకాడోలోని సహజ నూనెలు వెంట్రుకల షాఫ్ట్‌లోకి చొచ్చుకొనిపోయి, జుట్టును తేమగా ఉంచుతాయి, మంచి పోషణ అందించి, జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.

తేనె పెరుగు హెయిర్ ప్యాక్‌

మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలా? మీ జుట్టు సంరక్షణ దినచర్యలో తేనె- పెరుగు హెయిర్ ప్యాక్‌ని (DIY honey curd Hair Pack) చేర్చుకోండి. అరకప్పు సాదా పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి తడి జుట్టుకు అప్లై చేయండి. 30 నుండి 60 నిమిషాలు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం