DIY Hair Packs for Dandruff । తలలో చుండ్రు నివారణకు అద్భుతమైన హెయిర్ ప్యాక్‌లు!
DIY Hair Packs for Dandruff : చుండ్రు నివారణ కోసం ఇక్కడ కొన్ని హెయిర్ ప్యాక్ రెసిపీల గురించి తెలియజేస్తున్నాం. వీటిని మీ జుట్టుకు వర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
DIY Hair Packs for Dandruff : తలలో చుండ్రు రావడం అనేది చాలా మందికి ఇబ్బంది కలిగించే సమస్య. తలలో వెంట్రుకలపై, భుజాలపైన తెల్లని బూడిద రాలినట్లుగా ఉండే చుండ్రు చికాకును తెప్పిస్తుంది. ఈ చుండ్రు కారణంగా తల కూడా తరచుగా దురదగా అనిపిస్తుంది. అందులోనూ ఇది వర్షాకాలం, ఈ సీజన్ లో అనేక చర్మ, ఆరోగ్య సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా ఉంటాయి. వర్షపు నీటిలో జుట్టు తడిసినపుడు చుండ్రు పెరగటంతో పాటు ఇతర జుట్టు సమస్యలను కలిగిస్తుంది. మీరు చుండ్రు నివారణ కోసం ఎన్ని షాంపూలు వాడినా, ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితాలు లేకపోతే ఇక్కడ కొన్ని diy హెయిర్ ప్యాక్ రెసిపీల గురించి తెలియజేస్తున్నాం. వీటిని మీకు మీరుగా సులభంగా ఇంట్లో తయారు చేసుకొని (homemade) మీ జుట్టుకు వర్తిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మందార మెంతులు హెయిర్ ప్యాక్
చుండ్రు చికిత్సకు మందార అద్భుతమైన నివారణి. అదనంగా, మెంతులు జుట్టు పెరుగుదలకు సహాయపడే ఒక శక్తివంతమైన ఏజెంట్, ఇది చుండ్రు నివారణలో కూడా సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి గొప్ప హెయిర్ ప్యాక్‌ను (diy hibiscus fenugreek hair pack) ఎలా చేయాలో కింద చూడండి. .
విధానం:
- రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను 1 టేబుల్ స్పూన్ తీసుకోండి
- అర కప్పు పెరుగులో నానబెట్టిన మెంతులు వేయండి.
- అలాగే 10-12 శుభ్రమైన మందార ఆకులను తీసుకోండి
- ఈ మూడింటిని కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి
- ఆపై ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ అంతటా, జుట్టు పొడవు వరకు అప్లై చేయండి
- అరగంట పాటు అలాగే ఉంచుకొని, ఆరాక తేలికపాటి షాంపూతో జుట్టును కడిగేసుకోవాలి.
పెరుగు, తేనె నిమ్మ హెయిర్ ప్యాక్
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది స్కాల్ప్, జుట్టు యొక్క pH స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు పెరుగు డ్యామేజ్‌ని రిపేర్ చేస్తుంది, జుట్టుకు మెరుపును అందిస్తుంది. తేనే జుట్టును మృదువుగా మారుస్తుంది. ఈ మూడు పదార్థాలతో చేసే హెయిర్ ప్యాక్ (diy curd lemon hair pack) చుండ్రు నివారణతో పాటు ఇతర కొన్ని జుట్టు సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
విధానం:
- ఒక గిన్నెలో అర కప్పు పెరుగు తీసుకోండి
- ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి
- ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి
- అన్నింటినీ కలపి మెత్తని పేస్ట్‌లా చేయండి.
- ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు పూర్తిగా అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచాలి
- ఆపై సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించి శుభ్రం చేసుకోండి
- ఉత్తమ ఫలితాల కోసం దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించండి
గ్రీన్ టీ - పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ హెయిర్ ప్యాక్
గ్రీన్ టీ, పిప్పరమింట్ ఆయిల్ ఈ రెండూ కూడా చుండ్రును వదిలించుకోవడానికి ప్రభావవంతంగా ఉంటాయి. ఈ రెండూ చుండ్రును కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి, అలాగే స్కాల్ప్‌ను చల్లబరుస్తాయి. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ (diy green tea peppermint oil hair pack) జుట్టు కోల్పోయిన మెరుపును తిరిగి పొందడంలో సహాయపడుతుంది.
విధానం:
- ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోండి
- అందులో ఒక చెంచా వైట్ వెనిగర్ కలపండి
- ఆపై కొన్ని చుక్కల పుదీనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలపండి
- అన్నింటినీ బాగా కలిసిపోయేలా మంచి బ్లెండ్ ఇవ్వండి
- ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసే ముందు మీ జుట్టును కడగాలి, ఆపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.
- స్కాల్ప్ మీద మసాజ్ చేస్తూ 5 నిమిషాలు అలాగే ఉంచండి
- తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి కడిగేసుకోండి.
ఈ హెయిర్ ప్యాక్స్ వాడటం ద్వారా మీ తలలో చుండ్రు నిర్మూలింపబడుతుంది. స్కాల్ప్ కూడా పరిశుభ్రం అవుతుంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
సంబంధిత కథనం