Rajgira wada: రాజ్‌గిరా వడ.. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన స్నాక్..
Rajgira wada: వర్షాకాలంలో వేడివేడిగా చేసుకుని తినే రాజ్‌గిరా వడ రుచిలో చాలా బాగుంటుంది. దాని తయారీ విధానం చూసేయండి.
Amaranth and Peas Vada by Chef Tarun Sibal)
వర్షాకాలంలో సాయంత్రం పూట పిల్లలకు వేడివేడిగా ఏదైనా స్నాక్ చేసిపెట్టాలనుకుంటున్నారా? అయితే తక్కువ నూనెతో, ఆరోగ్యకరమైన రాజ్ గిరా తో ఈ వడలు చేసి పెట్టండి. రుచిగా ఉంటాయి. ఆరోగ్యం కూడా.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు రాజ్ గిరా
2 కప్పుల నీళ్లు
సగం కప్పు తాజా లేదా ఫ్రోజెన్ బటానీ
1 బంగాళదంప ఉడికించినది
1 చెంచా జీలకర్ర
పావు కప్పు వాల్‌నట్స్
సగం కప్పు కొత్తిమీర
2 పచ్చిమిర్చి
2 చెంచాల నెయ్యి
తగినంత ఉప్పు
తయారీ విధానం:
- ముందుగా నీళ్లు పోసుకుని అందులో రాజ్ గిరా, బటానీ వేసుకుని ఉడకనివ్వాలి. ఉప్పు కూడా వేసుకోవాలి. మామూలు నీళ్లకు బదులుగా కూరగాయలు ఉడికించిన నీళ్లు వాడితే ఇంకా రుచి ఉంటుంది.
- నీళ్లు ఇంకిపోయాక ఒక పావుగంటకు దింపేయాలి. ఇప్పుడు మిక్సీలో కొత్తిమీర, వాల్ నట్స్, పచ్చిమిర్చి వేసుకుని బరకగా పట్టుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని రాజ్ గిరా, బటానీతో కలిపేయాలి. బంగాళదుంప కూడా బాగా మెదిపి వేసుకోవాలి.
- కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి, జీలకర్ర వేసుకుని బాగా కలుపుకుని చిన్న ఉండల్లా చేసుకోవాలి.
- పెనం మీద నెయ్యి లేదా నూనె వేసుకుని కట్లెట్ లాగా ఒత్తుకున్న ఉండలను సర్దుకోవాలి.
- అంచుల వెంబడి నూనె వేసుకుంటూ రంగు మారేదాకా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి రాజ్ గిరా వడ రెడీ అయిపోతుంది.
టాపిక్