Poha cutlet: పోహా కట్లెట్.. అయిదు నిమిషాల్లో సిద్దం..-poha cutlet recipe in detail with proper measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Poha Cutlet: పోహా కట్లెట్.. అయిదు నిమిషాల్లో సిద్దం..

Poha cutlet: పోహా కట్లెట్.. అయిదు నిమిషాల్లో సిద్దం..

HT Telugu Desk HT Telugu
Jul 10, 2023 06:30 AM IST

Poha cutlet: అటుకులు, బంగాళదుంప కలిపి చేసే కట్లెట్ తయారుచేసుకోవడం చాలా సులభం. అదెలాగో చూసేయండి.

పోహా కట్లెట్
పోహా కట్లెట్ (Unsplash)

ఉదయాన్నే అల్పాహారంలోకి పోహాతో చేసిన కట్లెట్లు తింటే కడుపు నిండిపోతుంది. పోహా, బంగాళదుంపతో కలిపి చేసే ఈ కట్లెట్లు బయట క్సిస్పీగా ఉంటాయి. లోపల అన్ని మసాలాలు, కూరగాయల రుచితో పోషకాలు అందిస్తాయి. అయిదే అంటే అయిదే నిమిషాల్లో ఇది తయరీ చేయడం పూర్తయిపోతుంది.

కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల మందం అటుకులు

3 బంగాళదుంపలు

1 కప్పు క్యారట్ తురుము

సగం కప్పు క్యాప్సికం ముక్కలు

1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు

2 పచ్చిమిర్చి సన్నని తరుగు

సగం కప్పు సన్నం రవ్వ

1 చెంచా నూనె

తగినంత ఉప్పు

1 చెంచా కారం

సగం చెంచా ధనియాల పొడి

సగం చెంచా చాట్ మసాలా

సగం చెంచా గరం మసాలా

తయారీ విధానం:

  1. ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకుని మెదుపుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చూసుకోవాలి.
  2. ఇప్పుడు అటుకుల్ని నీళ్లలో ఒక నిమిషం నానబెట్టుకుని నీళ్ల నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు అటుకులతో పాటూ మిగతా పదార్థాలన్నీ కూడా వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు లేకుండానే బంగాళదుంప ముద్దవల్ల పదార్థాలన్నీ బాగా కలిసిపోతాయి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా ఒత్తుకుని కట్ లెట్ ప్యాటీల్లాగా చేసుకోవాలి.
  5. ఒక పెనం మీద ఒక చెంచా నూనె వేసుకొని అంతటా రాసుకోవాలి. ఇప్పుడు కట్‌లెట్లు పెనం మీద సర్దుకోవాలి. రంగు మారేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి.
  6. ఈ కట్లెట్లను ఏదైనా చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.

Whats_app_banner