తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sprouts Health Benefits । రోజూ మొలకలు తినండి.. అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

Sprouts Health Benefits । రోజూ మొలకలు తినండి.. అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

HT Telugu Desk HT Telugu

29 April 2023, 17:11 IST

google News
    • Sprouts Health Benefits: రోజూ ఉదయం  లేదా సాయంత్రం మొలకలు తినడం ద్వారా కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
Sprouts Health Benefits
Sprouts Health Benefits (Unsplash)

Sprouts Health Benefits

Sprouts Health Benefits: రోజూ ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం చిరుతిండిగా మొలకలు తినడం అలవాటు చేసుకోండి. మొలకెత్తిన గింజల్లో పోషకాలు నిండుగా ఉంటాయి. క్రమం తప్పకుండా తినడం ద్వారా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మొలకెత్తిన గింజల్లో వివిధ రకాల విటమిన్లతో పాటు ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయి, తద్వారా శరీరమంతా ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగి, పోషకాలు, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. మొలకలు తినడం ద్వారా కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.

మెరుగైన జీర్ణశక్తి కోసం

మొలకెత్తిన ధాన్యాలు జీర్ణక్రియ ప్రయోజనాలకు చాలా ప్రసిద్ది. ఎందుకంటే వీటిలో పీచు పదార్థంతో పాటు జీవక్రియకు మద్దతు ఇచ్చే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. మొలకలలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి, సాధారణ ప్రేగు కదలికలకు తోడ్పడుతుంది. త్వరగా పోషకాల శోషణ జరుగుతుంది శక్తి త్వరగా లభిస్తుంది. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు.

బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది

ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే రెండు ముఖ్యమైన ఖనిజాలైన ఇనుము, రాగి మొలకల ద్వారా పొందవచ్చు. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, మీ శరీరంలో RBC కౌంట్‌ పెరుగుతుంది. మొలకలలో లభించే పోషకాలు దెబ్బతిన్న రక్త నాళాలను సరిచేయడంలో కూడా సహాయపడతాయి.. రక్త ప్రసరణ సమస్యలు ఉన్నవారు లేదా గాయాల నుండి కోలుకుంటున్న వారు మొలకలు తినడం మంచిది.

గుండెకు మంచిది

మొలకలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి, ఇవి రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రక్త నాళాలలో వాపును నిరోధించే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలకు కూడా ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ లక్షణాల కారణంగా, మొలకలు గుండెకు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు.

కంటి చూపును మెరుగుపరుస్తుంది

మొలకలు తినడం కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిలో కీలకమైన విటమిన్లు A, Eలతో సహా కంటి ఆరోగ్యానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కళ్ళను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

అందం కోసం

మొలకలు జుట్టుకు, చర్మానికి సంబంధించి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే ఇవి తిన్నపుడు రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. పుష్కలమైన పొషకాలు మీ జుట్టుకు, చర్మానికి అందుతాయి. జుట్టు పెరుగుదలకు, మెరిసే చర్మానికి ఇది తోడ్పడుతుంది. తలలో రక్తం ప్రవాహం వలన వెంట్రుకల ఫోలికల్స్‌కు పోషకాల సరఫరా జరిగి అవి దృఢంగా మారతాయి. కాబట్టి జుట్టురాలడం తగ్గుతుంది. మొలకలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి.

తదుపరి వ్యాసం