తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lentil Soaking । పప్పులు ఉడికించే ముందు నానబెట్టండి.. ఎంతసేపు, ప్రయోజనమేంటి?

Lentil Soaking । పప్పులు ఉడికించే ముందు నానబెట్టండి.. ఎంతసేపు, ప్రయోజనమేంటి?

HT Telugu Desk HT Telugu

29 April 2023, 7:30 IST

google News
    • Lentil Soaking Tips: పప్పులు, కాయధాన్యాలు నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. వివిధ చిక్కుళ్ళు, కాయధాన్యాలను నానబెట్టడానికి సరైన వ్యవధిని ఇక్కడ తెలుసుకోండి.
Lentil Soaking Tips
Lentil Soaking Tips (slurrp)

Lentil Soaking Tips

Lentil Soaking Tips: పప్పుధాన్యాలు పుష్కలమైన ప్రోటీన్లను అందించే గొప్ప శాకాహార వనరులు (Plant based protein sources). దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండేందుకు ప్రతిరోజూ పప్పు తినడం మంచిది. పప్పులు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి, LDL లేదా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు పప్పు దినుసులు (Pulses) తినడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను (Blood Sugar Levels) మెరుగ్గా నిర్వహించుకోవచ్చు. అయితే పప్పులను వండడానికి ముందు నానబెట్టాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. పప్పులను నానబెట్టి ఉడకబెట్టుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలు ద్విగుణీకృతం అవుతాయని చెబుతున్నారు.

పప్పులు నానబెట్టుకొని (Soaked Lentils) తింటే, అది పోషకాల శోషణను (Nutrients absorption) మెరుగుపరచడమే కాకుండా, యాంటీ-న్యూట్రియంట్ ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. కాల్షియం, ఐరన్, జింక్‌లను బంధించడంలో సహాయపడుతుంది. నానబెట్టడం వంట సమయాన్ని తగ్గిస్తుంది, పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది. ఇలా తింటే కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలు వంటివి ఉండవు.

అయితే పప్పును నానబెట్టడం ఎంత ముఖ్యమో, నానబెట్టే వ్యవధి (Lentil Soaking Duration) కూడా తెలిసి ఉండటం ముఖ్యం. పూర్తి ప్రయోజనాలను పొందేందుకు కొన్ని పప్పు ధాన్యాలను 8-10 గంటల పాటు నానబెట్టాల్సిన అవసరం ఉంటే, మరికొన్నింటికి 4-5 గంటల వ్యవధి సరిపోతుంది. ఏ పప్పుధాన్యాలను ఎంత సమయం పాటు నానబెట్టాలి అనే విషయంపై న్యూట్రిషనిస్ట్ జూహీ కపూర్ సూచనలు ఇచ్చారు. అవి ఇక్కడ తెలుసుకోండి.

Split Pulses- పప్పులు

రెండుగా విభజించిన పప్పులు ఉడికించడం సులభం అందువల్ల వీటికి నానబెట్టే సమయం తక్కువగా ఉంటాయి. శనగపప్పు, కందిపప్పు, మినపపప్పు, పెసరిపప్పు వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. వీటిని నానబెట్టడానికి 4-6 గంటలు సరిపోతుంది. పెసరిపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది.

Legumes- పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలు లేదా చిక్కుళ్ళు ప్రాథమికంగా మొక్కల కాయల నుంచి వచ్చే విత్తనాల నిర్మాణంలో ఉంటాయి. వీటిని మొలకెత్తించవచ్చు కూడా. చాలా మంది వీటి మొలకలను (Sprouts) తింటారు. పెసర్లు, కందులు, శనగలు మొదలైన చిక్కుళ్ళు ఈ వర్గంలోకి వస్తాయి. వీటిని 6-8 గంటలు నానబెట్టడం మంచిది.

Beans- బీన్స్

సోయాబీన్, కిడ్నీ బీన్స్, బెంగాల్ గ్రాము, బ్లాక్ బీన్స్ వంటి పెద్ద పప్పుధాన్యాలు. వాటి పరిమాణం పెద్దగా ఉండటమే కాకుండా, కఠినమైన నిర్మాణం కలిగి ఉంటాయి. ఇలాంటి రకాలను 8-10 గంటలు నానబెట్టడం వలన ప్రయోజనం ఉంటుంది.

పప్పును సరైన వ్యవధిలో నానబెట్టడం వల్ల దాని రుచిని పెంచడంతో పాటు, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

తదుపరి వ్యాసం