Gestational Hypertension। గర్భస్థ రక్తపోటును నివారించేందుకు సహజ మార్గాలు ఇవిగో!
- Gestational Hypertension: గర్భధారణ సమయంలో మహిళలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ చూడండి.
- Gestational Hypertension: గర్భధారణ సమయంలో మహిళలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భిణీ స్త్రీలలో అధిక రక్తపోటు సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడ చూడండి.
(1 / 13)
సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత లేదా డెలివరీకి దగ్గరగా ఉన్న సమయంలో స్త్రీలలో గర్భస్థ రక్తపోటు సమస్య నిర్ధారణ అవుతుంది. ప్రసవించిన తర్వాత గర్భధారణ రక్తపోటు సాధారణంగా తగ్గిపోతుంది. అయితే ఆ లోపు దీనిని సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూడండి.
(Freepik)(2 / 13)
స్త్రీలలో గర్భస్థ రక్తపోటు సమస్య నివారణకు ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ దీక్షా భావ్సర్ కొన్ని చిట్కాలను పంచుకున్నారు, అవేంటో చూద్దాం.
(Unsplash)(3 / 13)
సాధారణ ఉప్పుకు బదులుగా హిమాలయన్ గులాబీ ఉప్పను ఉపయోగించండి. అధిక ఉప్పు, చక్కెరను కలిగి ఉన్న అన్ని ఆహారాలను నివారించండి.
(IStock)(4 / 13)
తేలికపాటి నడక: గర్భిణీలు ఉదయం లేదా సాయంత్రం వేళలో ఒక 30 నిముషాల పాటు నడకకు వెళ్లండి. ఒకరి తోడును తీసుకెళ్లి ప్రశాంతమైన పార్కులో లేదా మీ ఇంటి ఆవరణలో నడవడం చేయవచ్చు.
(Pixabay)(5 / 13)
ప్రాణాయామం: ప్రతిరోజూ 15 నిమిషాల పాటు అనులోమ-విలోమ ప్రాణయామం ఆచరించణ్డి. 10 నిమిషాల కాల భ్రమరి ప్రాణాయామం చేయండి. ప్రతిరోజూ 11 ఓంకార (ఓం పఠణ) అభ్యాసం చేయండి. ఇవి మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయి.
(Pixabay)(6 / 13)
గాడ్జెట్‌లను నివారించండి: నిద్ర లేచిన వెంటనే, పడుకునే ముందు 1 గంట పాటు మొబైల్ ఫోన్‌లతో సహా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఉపయోగించడం మానుకోండి
(https://www.pexels.com)(7 / 13)
ప్రినేటల్ యోగా: ప్రతి రోజూ గర్భిణీ స్త్రీలకు అవసరమయ్యే ప్రినేటల్ యోగాను ప్రాక్టీస్ చేయండి. యోగా గురువు మార్గదర్శకత్వంలో దీన్ని చేయడం ఉత్తమం.
(Getty Images/iStockphoto)(8 / 13)
తాజాగా ఎప్పటికప్పుడు ఇంట్లో వండిన తాజా భోజనం మాత్రమే తినండి, బయటి ఆహారాలు అసలే వద్దు.
(Pixabay)(11 / 13)
ప్రతిరోజు కనీసం 1 జామకాయ తినండి (శీతాకాలంలో). ఇది వికారం, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు