తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soaked Superfoods । రాత్రంతా నానబెట్టండి, ఉదయాన్నే ఇలా తినండి, ఇక మీ ఆరోగ్యాన్ని మరిచిపోండి!

Soaked Superfoods । రాత్రంతా నానబెట్టండి, ఉదయాన్నే ఇలా తినండి, ఇక మీ ఆరోగ్యాన్ని మరిచిపోండి!

HT Telugu Desk HT Telugu

18 January 2023, 16:00 IST

google News
    • Soaked Superfoods Health Benefits: కొన్ని ఆహార పదార్థాలను రాత్రంతా నాననెట్టి ఉదయాన్నే తినడం వలన గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 
Soaked Superfoods Health Benefits
Soaked Superfoods Health Benefits (slurrp)

Soaked Superfoods Health Benefits

ఉదయం వేళ మీరు తీసుకునే అల్పాహారం సరైన పోషకాలను కలిగి ఉంటే, అది మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఆహారం తినే విధానంలో చేసుకొనే చిన్న మార్పులు మీ మొత్తం ఆరోగ్యంలో పెద్ద మార్పును కలిగిస్తాయి.

మనలో చాలా మంది సూక్ష్మపోషకాల లోపాలను ఎదుర్కొంటారు, ఇది కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఉదాహరణకు శరీరంలో ఇనుము, ఫోలేట్, విటమిన్లు B12, A లోపం వలన రక్తహీనతకు దారితీస్తుంది. విటమిన్ డి లోపం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు తగ్గి, పిల్లల్లో రికెట్స్, పెద్దవారిలో ఎముకలు మృదుత్వం కలుగుతుంది.

బాదం, జీడిపప్పు, వాల్‌నట్, వేరుశెనగ వంటి నట్స్ బి-విటమిన్‌లు, ఫోలేట్, విటమిన్లకు మంచి మూలం. ఈ సూపర్‌ఫుడ్‌లను క్రమం తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని నానబెట్టుకొని తినడం వల్ల శరీరానికి పోషకాలు బాగా అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నట్స్, డ్రైఫ్రూట్లను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటిలో అజీర్ణానికి కారణమయ్యే ఫైటిక్ యాసిడ్‌ తొలగిపోతుంది. తద్వారా అవి సులభంగా జీర్ణమై పోషకాలు వెంటనే శరీరానికి అందుతాయి.

Soaked Superfoods Health Benefits

పోషకాహార నిపుణురాలు జూహీ కపూర్ మైక్రోన్యూట్రియెంట్ల లోపం వలన తలెత్తే అనారోగ్య సమస్యలు, వాటి భర్తీకి అవసరమయ్యే సూపర్‌ఫుడ్‌ల గురించి తెలియజేశారు.

1. PCOS కోసం నానబెట్టిన బాదం

నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల మహిళల్లో PCOS సమస్య పరిష్కారం అవుతుంది. ముఖంపై మొటిమలు కూడా తగ్గి, మెరిసే చర్మాన్ని పొందవచ్చని కపూర్ తెలిపారు. ఇందుకోసం 5-7 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి ప్రతిరోజూ తినాలి.

2. పీరియడ్స్ ట్రబుల్స్ కోసం నానబెట్టిన ఎండుద్రాక్ష

పీరియడ్స్ నొప్పి, క్రమరహిత పీరియడ్స్ కోసం, 6-8 నానబెట్టిన ఎండుద్రాక్ష , 2 కుంకుమ పువ్వు రేకులను రాత్రంతా నానబెట్టి. మరుసటి రోజు ఉదయం తీసుకోవాలి.

3. జుట్టు రాలడం అరికట్టడానికి నానబెట్టిన నల్ల ఎండుద్రాక్ష

జుట్టు రాలడం అరికట్టడానికి, రోగనిరోధక శక్తి మెరుగుపరచటానికి, కొన్ని నల్ల ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి, మరుసటి ఉదయం తినండి.

4. జ్ఞాపకశక్తి కోసం నానబెట్టిన వాల్‌నట్‌లు

మెదడు పనితీరు మెరుగు పరచటానికి, జ్ఞాపకశక్తి కోసం, ఏకాగ్రతను పెంచడానికి రెండు వాల్‌నట్‌లను రాత్రంతా నానబెట్టి, ఉదయం తినవచ్చు. పిల్లలకు ఇలా తినిపించడం వలన చదువులో ముందుంటారు.

5. చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం నానబెట్టిన పెసర్లు

మంచి జుట్టు, కండరాల ఆరోగ్యం , మంచి చర్మం కోసం 2 టేబుల్ స్పూన్ల పెసర్లను రాత్రంతా నానబెట్టి ఉదయం తినండి. ముఖ్యంగా టీనేజర్లు, మహిళలకు ఇది చాలా ఆరోగ్యకరం.

6. మలబద్ధకం నివారణకు నానబెట్టిన అంజీర్

నానబెట్టిన రెండు అత్తి పండ్లను తినడం ద్వారా మీ పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేయవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, సీనియర్ సిటిజన్లలో ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుందని కపూర్ చెప్పారు.

How To Soak Nuts and Dry Fruits - ఎలా నానబెట్టాలి

- ముందుగా నట్స్, డ్రైఫ్రూట్లను బాగా కడగాలి

- శుభ్రమైన త్రాగునీటిలో రాత్రంతా నానబెట్టండి

- ఉదయం ఆ నీటిని తొలగించండి

- వాల్‌నట్‌లు, అత్తి పండ్లను నేరుగా తినవచ్చు. పెసర్లను, వేరుశనగలను మొలకల రూపంలో తింటే మంచిది, ఇందుకోసం 6-8 గంటలు మొలకెత్తడానికి అనువైన వాతావరణం కల్పించాలి. ఆపై ఆవిరి మీద ఉడికించి సలాడ్‌తో తినండి.

ఇలా నానబెట్టుకున్న సూపర్ ఫుడ్స్ ను రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది.

తదుపరి వ్యాసం