(1 / 7)
చలికాలంలో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్ లాగా కొన్ని వాల్‌నట్‌లను తింటే చాలా మేలు చేస్తుంది. అయితే సరైన విధానంలో, సరైన మోతాదులో తినడం ముఖ్యం.
(2 / 7)
వాల్‌నట్‌ల ప్రయోజనాలు మీరు ఒక రోజులో ఎంత తింటారు, ఎలా తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ముందుగా వాల్‌నట్‌లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం
(Unsplash)(3 / 7)
వాల్‌నట్‌లు ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ లతో కూడిన సూపర్‌ఫుడ్‌లు. వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి. వాల్‌నట్స్ జుట్టు పల్చబడకుండా కూడా కాపాడుతుంది
(4 / 7)
వాల్‌నట్స్‌లో మెదడు బాగా పని చేసే కొన్ని పోషకాలు ఉంటాయి. ఒత్తిడి భావాలను తగ్గిస్తుంది. మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఏకాగ్రతను పెంచుతుంది. వాల్ నట్స్ లో ఉండే ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
(5 / 7)
జీర్ణక్రియ మరియు ఎముకలను బలోపేతం చేయడానికి - వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎముకలను దృఢంగా ఉంచేందుకు ఇది చాలా మేలు చేస్తాయి. అలాగే, పొటాషియం, జింక్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు నిండుగా ఉండే వాల్‌నట్‌లు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
(6 / 7)
రోజులో ఎన్ని వాల్ నట్స్ తినాలి: రోజూ 3 నుంచి 4 వాల్ నట్స్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3 నుండి 4 వాల్‌నట్స్ తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణుల సలహా.
(7 / 7)
వాల్‌నట్‌లను తినడానికి ముందు కనీసం 5 నుండి 6 గంటలు నానబెట్టండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నీటిలో నానబెట్టిన వాల్‌నట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువును తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. వాల్‌నట్‌లను నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తినండి.
ఇతర గ్యాలరీలు