తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Banana On Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో బనానా తింటున్నారా? అయితే ఇది మీకోసమే..

Eating Banana on Empty Stomach : ఉదయాన్నే ఖాళీ కడుపుతో బనానా తింటున్నారా? అయితే ఇది మీకోసమే..

20 November 2022, 8:08 IST

    • Eating Banana on Empty Stomach : అరటిపండు సూపర్ ఫ్రూట్. దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దీనిని సరైన సమయంలో.. సరైనా మోతాదులో తీసుకుంటే మంచిది. లేకుంటే.. ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏ సమయంలో అరటిపండు తింటే మంచిదో.. ఎప్పుడు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో బనానా తినకండి.. ఎందుకంటే..
ఖాళీ కడుపుతో బనానా తినకండి.. ఎందుకంటే..

ఖాళీ కడుపుతో బనానా తినకండి.. ఎందుకంటే..

Eating Banana on Empty Stomach : అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ మీకు జరగాలంటే.. వాటిని సరైన మార్గంలో, సరైన సమయంలో తినడం నేర్చుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Garlic Rice: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, పులిహోర కన్నా అదిరిపోతుంది

Peanuts for Diabetic: మధుమేహం ఉన్నవారు వేరుశెనగ పలుకులను తినడం ప్రమాదమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

అరటిపండ్లు మనకి తక్షణమే ఎనర్జీని ఇస్తాయి. కాబట్టి ఉదయాన్నే జిమ్​కి వెళ్లేవారు.. లేదంటే జిమ్​లో కష్టపడి ఇంటికి వచ్చే వారు ఖాళీ కడుపుతో అరటిపండ్లను తింటారు. ఇవి ఎనర్జీని ఇస్తాయి నిజమే కాదు అనట్లేదు. కానీ.. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తీసుకుంటే.. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామంది ఉదయం ఆఫీసుకు వెళ్లాలనే తొందరలో ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటారు. ఎందుకంటే ఇది శక్తితో కూడిన పండు అని.. రోజంతా దాని ద్వారా పని చేసే శక్తిని పొందుతామని భావిస్తారు. కానీ ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటే.. ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది అంటున్నారు నిపుణులు. అయితే అరటిపండును ఖాళీ కడుపుతో ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ సమస్య

అరటిపండులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అయితే అదే సమయంలో పండు ఆమ్లంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఆమ్ల ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే అరటిపండ్లను ఖాళీ కడుపుతో అస్సలు తినకండి.

గుండె సమస్య

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రక్తంలో ఈ రెండు పోషకాలు అధికంగా చేరి.. గుండెకు హాని కలిగిస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో అరటిపండు తినే ముందు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి.

అలసట, నీరసం

అరటిపండు తింటే రోజంతా శక్తి వస్తుంది కరెక్టే. కానీ ఖాళీ కడుపుతో తిన్నప్పుడు మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో మీరు అరటిపండు తింటే.. అది మీకు తక్షణ శక్తిని ఇస్తుంది. కానీ అది తాత్కాలికంగానే ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా అలసిపోతారు. నీరసంగా ఉంటుంది. మళ్లీ ఆకలి వేస్తుంది. దీనివల్ల అతిగా తినడం ప్రారంభిస్తారు. అందుకే ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తీసుకోండి కానీ.. అల్పాహారమే అరటిపండ్లు చేయకండి. అంటే ఖాళీ కడుపుతో అరటిపండ్లను తినకండి.

ఉదయాన్నే తినొద్దు అంటున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు అరటిపండ్లు తినొచ్చా అంటే.. అది కూడా నో. రాత్రి పడుకునే ముందు బనానా తింటే.. దాని వల్ల దగ్గు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. మంచిగా ఫుడ్ తీసుకున్నాక.. అరటిపండ్లు తీసుకోవడం ఉత్తమం.

టాపిక్