తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinking Cold Water : చల్లని నీరు తాగుతున్నారా? అయితే జాగ్రత్త

Drinking Cold Water : చల్లని నీరు తాగుతున్నారా? అయితే జాగ్రత్త

08 October 2022, 15:19 IST

    • Side Effects of Drinking Cold Water : బయట తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిజ్ నుంచి నీరు తీసి తాగి ఆహా.. ఎంత సమ్మగా ఉంటుంది కదా. కానీ ఫ్రిజ్ నీళ్లు, చల్లని నీరు తాగితే.. శరీరానికి హాని కలుగుతుందని మీకు తెలుసా? ఈ అలవాటు వెంటనే మార్చుకోవాలి అంటున్నారు నిపుణులు. అసలు ఇంతకీ ఫ్రిజ్ వాటర్ తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చల్లని నీరు తాగితే..
చల్లని నీరు తాగితే..

చల్లని నీరు తాగితే..

Side Effects of Drinking Cold Water : చల్లని నీరు తాగితే గొంతు నొప్పి వస్తుంది అనుకుంటారు కానీ. ఇదొక్కటే కాదు.. రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన చల్లటి నీరు తాగితే.. శరీరానికి హాని కలుగుతుంది. అందుకే ఈ అలవాటు మానేయడం మంచిది. అసలు శరీరానికి ఎలాంటి హానీ జరుగుతుందో ఇప్పుడు చుద్దాం.

మెగ్రేన్ పెంచుతుంది

మీకు తలనొప్పి ఉందా? మైగ్రేన్‌ ఉన్నవారు ఫ్రిజ్‌లో ఉంచిన నీరు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే మెగ్రేన్ ఎక్కువ అయ్యే అవకాశముంది.

జీర్ణక్రియ నెమ్మదవుతుంది..

చల్లటి నీరు చాలా సందర్భాలలో జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలకు కూడా కారణమవుతుంది.

తల తిరుగుతుంది..

వ్యాయామం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా చల్లని నీరు తాగకండి. దీని వల్ల తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తాయి.

బరువు తగ్గాలనుకుంటే..

భోజన సమయంలో చల్లని నీరు లేదా పానీయాలు అందించే రెస్టారెంట్లు చాలానే ఉంటాయి. ఎందుకంటే చల్లని నీరు లేదా పానీయాలు మన ఆకలిని పెంచుతాయి. సాల్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు నోటిలో డల్ టేస్ట్ రాకుండా చేస్తుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే.. భోజనంతో పాటు చల్లటి నీటిని తాగడం మానేయండి.

టాన్సిల్ రాకూడదంటే..

అన్నింటికంటే చల్లటి నీరు టాన్సిల్ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఫ్రిజ్‌లోంచి నీళ్లు తాగే అలవాటును ఇప్పుడే వదిలేయండి. అయితే నార్మల్ టెంపరేచర్ వాటర్ లో కొద్దిగా చల్లటి నీటిని మిక్స్ చేసి తాగవచ్చు.

టాపిక్