Sleeping In Chair : కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నారా? వామ్మో చాలా ప్రమాదం
01 April 2023, 17:30 IST
- Sleeping In Chair : చాలా మందికి కుర్చీలో కూర్చొని నిద్రపోవడం అనేది ఓ అలవాటు. ఇలా కాసేపు కుర్చీలో కూర్చొంటే.. అలా కాసేపట్లో నిద్రపడుతుంది. కానీ ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
కుర్చీలో నిద్రపోతే సమస్యలు
ఆఫీసులో, లేదా ఇంట్లో అయినా.. కొన్నిసార్లు కుర్చీలో ఓ కునుకు వేస్తాం. స్కూళ్లో పిల్లలు కూడా.. అలా పాఠం వింటూనే.. ఓ చిన్న నిద్ర తీస్తారు. టీచర్ల దగ్గర బుక్ అయిపోతారు. బస్సులో వెళ్లేప్పుడూ.. సీటు దొరికిందంటే.. కాసేపు కునుకు వేయాల్సిందే. ఇలా ఎక్కడ పడితే.. అక్కడ కుర్చీలో కునుకు(Sleeping In Chair) తీస్తే.. చాలా ప్రమాదం. చిన్న కునుకు వేస్తే.. పెద్ద ప్రమాదాలే ఉంటాయి. అలా పడుకుంటే.. కాసేపు హాయిగా ఉంటుంది. కానీ తీవ్రమైన సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
తీవ్రమైన బ్యాక్ పెయిన్(Back Pain), మెడ, భుజాల నొప్పి వస్తాయి. ఒకే చోట గంటలతరబడి ఉండటం, కుర్చోటం, నిల్చోవటం మనుషులకు కుదరదు. కుర్చీలో కూర్చొని నిద్రపోతే.. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వస్తాయట. మనం మంచం మీద నిద్రపోతే(Sleeping).. చేతులు, కాళ్లలోని కండరాలు సాగి విశ్రాంతిని తీుకుంటాయి. అదే కూర్చొని నిద్రపోయారంటే.. రక్త ప్రసరణను మందగించేలా చేస్తుంది. కదలికల మీద ప్రభావం పడుతుంది. వీటితో కొత్త సమస్యలు వస్తాయి.
కూర్చొని పడుకుంటే.. కొన్ని స్వల్పకాలిక సమస్యలతోపాటుగా డీప్ వీన్ థ్రోంబోసిస్ అదే.. రక్తం గడ్డకట్టడం లాంటివి కూడా జరుగుతాయి. ఎలాంటి కదలికలు లేకుండా.. ఓ వైపు పడుకుంటే.. ఎక్కువ సమయం కూర్చొని నిద్రపోతే.. ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితిని పట్టించుకోకుండా వదిలిస్తే అది తీవ్రమై కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చు. రక్తం గడ్డకట్టుకుని అది పగిలిపోయినప్పుడు.. అది వేగంగా ఊపిరితిత్తులు, మెదడు చేరి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరణానికి కూడా కారణం కావొచ్చు. రక్తం గడ్డకట్టడంతో ప్రతీ రోజూ 200 మంది వరకూ చనిపోతున్నారని అంచనా. ఇలాంటి సమస్యలు తక్కువ వయసు వారిలోనూ రావొచ్చు.
డీప్ వీన్ థ్రోంబోసిస్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోండి. మడమ, పాదం, పిక్కలు వాపు, నొప్పి, వాపుతో చర్మం(Skin) ఎర్రబారడం, వేడిగా అవడం అవుతుంటుంది. మీలో ఎవరైనా.. కుర్చీలో కూర్చొని నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి.
ఎక్కువ సేపు కూర్చొవడం నడుము నొప్పికి ప్రధాన కారణం. ఎక్కువ సేపు నిలుచున్నా.. కూడా సమస్యే. ఇలాంటి వాటితో పొత్తికడుపులోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఫలితంగా దిగువ వీపులో సమస్య వస్తుంది.
మీరు ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తే చాలా సమస్యలు వస్తాయ్. కుర్చీ, వర్క్ స్క్రీన్(Work Screen) మీద అలానే ఉంటే.. సమస్యలే కదా. తీవ్రమైన వెన్నునొప్పి వస్తుంది. తరచుగా ల్యాప్‌టాప్‌లు(Laptop), టాబ్లెట్‌లను ఉపయోగిస్తాం. అయితే ఇవి ఉండే విధానం సరిగా ఉండాలి. అవి పెట్టే విధానంతోనే భంగిమ సరిగా ఉండదు. మంచం మీద కూర్చొని, లేదా పడుకుని ల్యాప్‌టాప్‌ని ఉపయోగించడం కూడా ప్రమాదమే. వెన్ను, మెడ కండరాలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.