Right Side Wake Up : ఉదయం కుడివైపు ఎందుకు నిద్ర లేవాలి?-do you know right side wake up good for your health here is why ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do You Know Right Side Wake Up Good For Your Health Here Is Why

Right Side Wake Up : ఉదయం కుడివైపు ఎందుకు నిద్ర లేవాలి?

HT Telugu Desk HT Telugu
Mar 28, 2023 08:20 AM IST

Right Side Wake Up : ఉదయాన్నే నిద్ర లేవడం ఎంత ముఖ్యమో.. త్వరగా నిద్రపోవడం కూడా అంతే ముఖ్యం. పడుకోవడం ఒకే.. కానీ ఉదయం ఎటువైపు లేస్తే మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? కుడివైపు నుంచి మేల్కోవాలని పెద్దలు చెప్పారు. కానీ నేటికీ చాలా మందికి దాని వెనుక కారణం తెలియదు.

కుడివైపు నిద్ర లేవాలి
కుడివైపు నిద్ర లేవాలి (unsplash)

మనం రాత్రిపూట నిద్రపోవడానికి సరైన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే మెడ, వీపు, శరీరంలోని అన్ని భాగాలలో నొప్పి కనిపిస్తుంది. అదేవిధంగా, ఉదయాన్నే నిద్రలేవడం(Wake Up In Morning) కూడా మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎడమవైపు నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది. కుడివైపునకు నిద్ర లేవడం కూడా మంచిది.

అర్ధరాత్రి నిద్రపోవడం మంచి అలవాటు కాదు. దీని కారణంగా ఉదయం నిద్రలేవగానే తీవ్రమైన తలనొప్పి(Headche వస్తుంది. కాబట్టి రాత్రి నిద్ర బాగా ఉండాలి. అంతేకాదు, ఇష్టం వచ్చినట్లుగా నిద్రపోతున్నప్పుడు కూడా చేయి నొప్పిగా ఉంటుంది. ఉదయం లేవగానే అప్రమత్తంగా ఉండాలి.

కుడివైపు నుండి లేవడం చాలా మంచిది

చాలా మంది ఉదయాన్నే కుడివైపు నిద్ర లేస్తారు. నిజం చెప్పాలంటే ఇది మంచి పద్ధతి. ఆయుర్వేదం, ఆధునిక వైద్యం కూడా ఈ అభ్యాసం మంచిదని నిరూపించాయి. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలు(Health Problems), ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మన మెదడు కుడి వైపు సృజనాత్మక కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఎడమ వైపు తార్కిక శబ్ద కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఉదయం కుడి వైపున మేల్కొలనడం వల్ల మీ రోజు ప్రశాంతంగా, ఒత్తిడి(Stress) లేకుండా చేయవచ్చు.

తాగి ఎడమవైపు నుంచి లేవడం ప్రమాదకరం

తాగిన వ్యక్తి మరుసటి రోజు హ్యాంగోవర్‌(hangover)తో మేల్కొంటాడు. కొన్నిసార్లు స్పృహ కోల్పోవచ్చు. కొంతమందికి ఆకలి కూడా వస్తుంది. ఇదే హ్యాంగోవర్‌తో ఉదయం ఎడమవైపు నిద్రలేచినట్లయితే, పడి గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా హ్యాంగోవర్ ఉన్నవారు ఎక్కువగా ఎడమ వైపే కింద పడిపోతుంటారు. మద్యం సేవించని వారు కూడా ఎడమవైపు నుంచి లేచి ఒక్కసారిగా కిందపడిపోతే కళ్లు తిరగడం ఖాయం. కాబట్టి నిద్రలేవగానే అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. కుడివైపు నుంచి లేవాలి.

లైంగిక చర్యలో పాల్గొంటున్నప్పుడు

మీరు లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత మంచం ఎడమ వైపున లేచేందుకు ప్రయత్నిస్తే, అది కుడి వైపున మరింత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. తెల్లవారుజామున కుడివైపు నిద్ర లేవడం మంచిదని కేవలం నమ్మకం కాదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు కుడివైపు నుంచి లేవడానికి(Right Side Wake Up) ప్రయత్నించండి.

చిన్నప్పుడు పెద్దవాళ్లు కూడా కుడి పక్క నుంచి లేస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. దీని వెనకు కూడా సైన్స్ ఉంది. నిద్రలేవగానే.. రెండు అరచేతులు రుద్దుకుని కళ్ల మీద ఉంచుకోవాలి. దీనిద్వారా.. అరచేతుల్లో ఉండే నాడులు ఉత్తేజితమై శరీర వ్యవస్థ పూర్తి స్పృహలోకి వస్తుంది. ఉదయం లేవగానే.. కుడి పక్కకు తిరగాలి. నిద్ర లేచిన వెంటనే.. మెటబాలిజం తక్కువగా ఉంటుంది. కాబట్టి.. కుడిపక్కకు లేచి, మంచం దిగాలి. ఎడమ పక్క తిరిగి లేచి నిలబడితే.. గుండె మీద ఒత్తిడి(Stress On Heart) పడుతుంది.

WhatsApp channel