తెలుగు న్యూస్ / ఫోటో /
People Pleaser | ఇతరులను మెప్పించేలా ఉంటూ, మిమ్మల్ని మీరు నొప్పించుకోవడం లేదుగా?
- People Pleaser: ఇతరుల మెప్పు పొందే వ్యక్తిగా ఉండటంలో తప్పులేదు కానీ, ఈ ధోరణి మీకు అనేక విధాలుగా మీకు హాని కలిగించవచ్చునని నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.
- People Pleaser: ఇతరుల మెప్పు పొందే వ్యక్తిగా ఉండటంలో తప్పులేదు కానీ, ఈ ధోరణి మీకు అనేక విధాలుగా మీకు హాని కలిగించవచ్చునని నిపుణులు అంటున్నారు, ఎలాగో చూడండి.
(1 / 6)
ఎల్లప్పుడూ ఇతరులను మెప్పించే వ్యక్తిగా ఉండటం అనే వ్యవహరశైలికి కారణం గతంలో మీకు దక్కాల్సిన ప్రశంసలు మీకు దక్కకపోవడం అని నిపుణులు అంటున్నారు. కొన్ని పాత గాయాలు మీలో ఈ మార్పుకు కారణం అయి ఉండవచ్చు అని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మీ మానసిక ఆరోగ్యానికి హాని కలిగించవచ్చునని హెచ్చరిస్తున్నారు. (Unsplash)
(2 / 6)
వ్యక్తిగత సరిహద్దులను కోల్పోవడం: ఇతరులను సంతోషపెట్టే వ్యక్తులు తరచుగా తమ సంతోషాలను కోల్పోవడంలో, తమకోసం తాము సమయం కేటాయించుకోవడంలో కష్టపడుతుంటారు. అది వారిలో అసంతృప్తికి దారితీయవచ్చు (Unsplash)
(3 / 6)
వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేయడం: మీరు మీ స్వంత అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మీరు మీ స్వంత అవసరాలను తీర్చుకోవడంలో విఫలం అవ్వొచ్చు. ఇది మీలో మీరే ఆగ్రహం, నిరాశ ఇతర తీవ్రమైన భావనలకు దారి తీస్తుంది. (Unsplash)
(4 / 6)
ప్రామాణికత లేకపోవడం: ఇతరులు నొచ్చుకుంటారు లేదా వారు నిరుత్సాహపడతారేమో అనే భయం ఉంటుంది. దీంతో ఆలోచనలు, భావాలను బలంగా వ్యక్తపరచలేరు. ఇది మీ నుండి సంతోషాన్ని తొలగిస్తుంది. (Unsplash)
(5 / 6)
ఆత్మగౌరవానికి భంగం: ఇతరులను సంతోషపెట్టడానికి మీ విలువలను తాకట్టు పెట్టాల్సి వస్తే మీ ఆత్మగౌరవాన్ని మీరే కించపరుచుకున్నట్లు. మీ విలువ కూడా తగ్గవచ్చు. (Unsplash)
ఇతర గ్యాలరీలు