తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vastu Tips: ఇతరులకు సంబంధించిన ఈ 6 వస్తువులను ఎప్పుడు వాడకండి!

Vastu Tips: ఇతరులకు సంబంధించిన ఈ 6 వస్తువులను ఎప్పుడు వాడకండి!

HT Telugu Desk HT Telugu

08 May 2022, 22:13 IST

    • ఇతరులకు సంబంధించిన వస్తువులను ఎప్పుడు వాడకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అవి చెడు ప్రభావం చూపుతాయని శాస్త్రం వివరిస్తోంది.  
vastu_tips
vastu_tips

vastu_tips

సాధరణంగా ఇతరుల వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదని పెద్దల చెప్తుంటారు. వాస్తు శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. వాస్తు ప్రకారం, ఇతరులకు సంబంధించిన కొన్ని వస్తువులను ఉపయోగించడం ద్వారా అవి వారిపై ప్రతికూల శక్తి ప్రభావం చూపుతుంది. ఈ చిన్న విషయాలే పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని జోతిష్య నిపుణులు అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇతరులకు సంబంధించిన ఏ వస్తువులు ఉపయోగించకూడదో తెలుసుకోండి-

ట్రెండింగ్ వార్తలు

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో H అక్షరం దాక్కుంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి

Chanakya Tips Telugu : ఈ 8 లోపాలు మీలో ఉంటే జీవితంలో విజయం సాధించలేరు

West Nile Fever: వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్, ఈ జ్వరం లక్షణాలు ఇవే

Chettinad Idli Podi: ఇడ్లీ దోశెల్లోకి చెట్టినాడ్ ఇడ్లీ పొడి, ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు నిల్వ ఉంటుంది

రుమాలు - వాస్తు శాస్త్రం ప్రకారం, మరొక వ్యక్తి రుమాలు ఉపయోగిచడం వల్ల సంబంధాలలో దూరం వస్తుంది. అందుకే ఎప్పుడూ ఇతరుల చేతి రుమాలు మీ దగ్గర ఉంచుకోకండి.

గడియారం- వాస్తు శాస్త్రంలో, గడియారం వల్ల సానుకూలమైన, ప్రతికూలమైన అంశాలు ఉన్నాయి. మణికట్టుపై మరొకరి గడియారాన్ని ధరించడం అశుభం. ఇలా చేయడం వల్ల చెడుకాలం మొదలవుతుందని అంటారు.

పెన్- వాస్తు శాస్త్రం ప్రకారం, ఏ వ్యక్తి కూడా తన దగ్గర మరొకరి పెన్ను ఉంచుకోకూడదు . అలా చేస్తే కెరీర్‌పై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. దీనివల్ల డబ్బు కూడా నష్టపోవచ్చు.

బట్టలు- వాస్తు ప్రకారం, ఏ వ్యక్తి ఎప్పుడూ ఇతరుల బట్టలు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల మనలో ప్రతికూలత ప్రవేశించి జీవితంలో కష్టాలు వస్తాయని అంటారు.

ఉంగరం- మరొకరి ఉంగరాన్ని ధరించడం వాస్తులో అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మనిషి ఆరోగ్యం, జీవితం, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని అంటున్నారు.

గమనిక: పై కంటెంట్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ద్వారా సూచించబడినది కాదు. వాటిని స్వీకరించే ముందు, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.