తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Broken Mirror । ఇంట్లో పగిలిన అద్దం ఉంచుకోవద్దా? వాస్తుశాస్త్రం చెబుతుంది ఇదీ!

Broken Mirror । ఇంట్లో పగిలిన అద్దం ఉంచుకోవద్దా? వాస్తుశాస్త్రం చెబుతుంది ఇదీ!

HT Telugu Desk HT Telugu

12 July 2022, 15:29 IST

    • ఇంట్లో పగిలిన అద్దం ఉండకూడదు, పగిలిన అద్దంలో ముఖం చూడకూడదు అని పెద్దలు అంటుంటారు. మరి ఎలాంటి అద్దాలు ఉండాలి? వాస్తుశాస్త్రం ఏం చెబుతుంది? పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
Vastu Tips on Placing Mirrors
Vastu Tips on Placing Mirrors (Unsaplash)

Vastu Tips on Placing Mirrors

పొద్దున లేచిన దగ్గర్నించి, రాత్రి పడుకునే సమయం వరకు ఏ సమయంలోనైనా మనం తరచుగా చూసే వస్తువు ఏదైనా ఉందంటే అది అద్దమే. మన స్మార్ట్ ఫోన్ లో కూడా సెల్ఫీ కెమెరాను తెరిచి అద్దంలాగా వాడుకుంటాం. అంతగా మన జీవితంలో భాగమైపోయింది అద్దం. మన అందాన్ని చూసుకోవాలనుకున్నా, మన కట్టూ, బొట్టూ మార్చుకోవాలన్నా మనం అద్దం చూస్తాం. అందరి ఇళ్లల్లో అద్దాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవారు ఉన్న ఇళ్లల్లో ఏమీ లేకపోయినా అద్దాలు ఉండాల్సిందే. ఈ అద్దాలు అవసరానికి ఉపయోగపడటమే కాకుండా, ఇంటికి అలంకరణగా కూడా ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో H అక్షరం దాక్కుంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి

Chanakya Tips Telugu : ఈ 8 లోపాలు మీలో ఉంటే జీవితంలో విజయం సాధించలేరు

West Nile Fever: వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్, ఈ జ్వరం లక్షణాలు ఇవే

Chettinad Idli Podi: ఇడ్లీ దోశెల్లోకి చెట్టినాడ్ ఇడ్లీ పొడి, ఒక్కసారి చేసుకుంటే నెలరోజులు నిల్వ ఉంటుంది

అయితే వాస్తు శాస్త్రంలోనూ అద్దానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంట్లో అద్ధం అనేది ఉండాలి. అలాగే అది సరైన దిశలోనూ ఉండాలి. మరోవైపు పగిలిన అద్ధాలను ఇంట్లో ఉంచుకోకూడదు. ఒకవేళ ఉంచుకుంటే ఏమవుతుంది? ఇంట్లో అద్ధం ఉంచటానికి ఏది సరైన దిశ, ఎలాంటి అద్ధాలను ఉంచాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికి వాస్తుశాస్త్ర నిపుణులు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో ఇక్కడ తెలుసుకోండి.

ఏ దిశలో అద్ధం ఉంచాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అద్దం పెట్టడం శుభప్రదం. అద్దం ఇంటి అలంకరణ కోసం ఉద్దేశించినప్పటికీ, దానిని సరైన దిశలో ఉంచడం ద్వారా శుభ ఫలితాలను ఇస్తుంది. అది మీ అదృష్టాన్ని కూడా మార్చగలదు. అద్దాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల ఇంటిలోని వాస్తు దోషం తగ్గుతుంది.

అద్దాలను ఎల్లప్పుడూ ఇంటి తూర్పు లేదా ఉత్తర గోడలపై ఉంచాలి. దక్షిణ లేదా పడమర గోడలపై ఎప్పుడూ ఉంచకూడదు.

ఇంట్లో డ్రెస్సింగ్ రూమ్, వాష్‌రూమ్ కాకుండా, డైనింగ్ టేబుల్‌కి ఎదురుగా డైనింగ్ ఏరియాలో కూడా అద్దాలను ఉంచవచ్చు. తద్వారా భోజనం చేసేటప్పుడు కుటుంబం మొత్తం అద్దంలో ప్రతిబింబిస్తుంది. వాస్తు ప్రకారం, ఇది శ్రేయస్సును తెస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పెంచుతుంది.

మీ లాకర్ లోపల అద్దాన్ని ఉంచడం మీ సంపదను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే అది వక్రీకరణ దృశ్యాన్ని చూపకూడదు.

పగిలిన అద్ధం ఎందుకు ఉంచుకోకూడదు?

అద్దం ఎప్పుడు పరిశుభ్రంగా, స్పష్టమైన ప్రతిబింబాన్ని చూపాలి. పగిలిన అద్దం ఇంట్లో ఉంచుకోకూడదు. ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. అద్దం అకస్మాత్తుగా పగిలిపోయింది అంటే దాని అర్థం మన కుటుంబం ఏదో పెద్ద సమస్య నుంచి బయటపడింది, మన ఇంటిలోని పీడ ఏదో తొలగిపోయింది అని అర్థం. అయితే అలా పగిలిన అద్దాన్ని మాత్రం బయటపడేసి వెంటనే ఆ స్థానంలో కొత్త అద్దాన్ని అమర్చుకోవాలి.

అలాగే ఇంట్లో గుండ్రని అద్దాలు కాకుండా దీర్ఘచతురస్రాకారపు అద్దాలు ఉంచుకోవాలి. దీర్ఘచతురస్రాకారపు అద్దాలు సంపూర్ణ వాస్తును కలిగి ఉంటాయి. గుండ్రటి అంచుల గాజును ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించకూడదు. దీనివల్ల ఆ ఇంట్లో సమస్యలు ఉంటాయి. గుండ్రంగా కాకుండా అష్టభుజి అంటే ఎనిమిది మూలల అద్దం పెట్టుకోవచ్చు అని సూచిస్తున్నారు

టాపిక్