తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Keeway 250cc Cruiser | మార్కెట్లోకి మరో సరికొత్త రెట్రో-లుక్‌ మోటార్ సైకిల్!

Keeway 250cc Cruiser | మార్కెట్లోకి మరో సరికొత్త రెట్రో-లుక్‌ మోటార్ సైకిల్!

HT Telugu Desk HT Telugu

19 May 2022, 11:22 IST

    • Benelli Keeway 250cc Cruiser –హంగేరీకి చెందిన కీవే అనే ద్విచక్ర వాహన తయారీదారు K Lite 250V పేరుతో ఒక రెట్రో లుక్ క్రూజర్ మోటార్ సైకిల్‌ను భారత మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటోర్ 350 మోటార్ సైకిల్‌తో పోటీ పడుతుంది. 
Benelli Keeway 250cc Cruiser
Benelli Keeway 250cc Cruiser (Keeway)

Benelli Keeway 250cc Cruiser

హంగేరీకి చెందిన ప్రముఖ్య ద్విచక్ర వాహన తయారీదారు బెనెల్లీ, దీని సిస్టర్ సంస్థ అయిన కీవే భారతీయ మార్కెట్ కోసం మూడు ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించింది. ఇందులో 300 సిసి సామర్థ్యం కలిగిన 2 స్కూటర్లు ఉండగా ఒకటి 250 సిసి క్రూజర్ బైక్. ఇప్పటికే రూ. 10 వేలు టోకెన్ ధరతో వీటి బుకింగ్స్ ప్రారంభమైనాయి. మే 26 నుంచి టెస్ట్ రైడ్లు ప్రారంభం అవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Benelli Keeway 250cc క్రూయిజర్ – K లైట్ 250V బైక్ విషయానికి వస్తే ఇది డిజైన్ పరంగా ఇతర క్రూయిజర్ బైకులైన Harley-Davidson Fat Bobకి దగ్గరగా ఉంటుంది. ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటోర్ 350 మోటార్ సైకిల్‌తో పోటీ పడుతుంది.

ఈ Keeway K-Light 250V బైక్‌లో క్లాసిక్ రెట్రో మోటార్‌సైకిల్ లాంటి షేప్, అలాగే రౌండ్ హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

K-లైట్ బైక్‌లో ట్యాంక్-మౌంటెడ్ సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఇది గేర్ పొజిషన్ ఇండికేటర్‌తో సహా అనేక రకాల సమాచారాన్ని చూపుతుంది. ఇందులో కీవే ప్రత్యేకమైన 249cc V-ట్విన్ ఎయిర్ కూల్డ్ మోటార్ ఇంజన్ అమర్చారు. ఇది 8,500 rpm వద్ద 18.7 hp గరిష్ట శక్తిని అలాగే 5,500 rpm వద్ద 19 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

సస్పెన్షన్ సిస్టమ్‌లో ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లు, వెనుకవైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్‌గా వస్తుంది. రెండు చివరల డిస్క్ బ్రేక్‌ల ద్వారా బ్రేక్ పనిచేస్తుంది.

అన్ని-LED లైట్లు, విడిగా ఎత్తుగా ఉండే సీట్, పిలియన్ బ్యాక్ రెస్ట్, ఇంజిన్ గార్డ్, డ్యూయల్ ఎగ్జాస్ట్, షార్ట్ టెయిల్ సెక్షన్, వెనుక టైర్ హగ్గర్ వంటి ఇతర ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. మొత్తంమీద దృఢంగా ఉంది.

రైడ్ సౌకర్యం పరంగా చూస్తే ప్లస్ పాయింట్లలో స్కూప్-అప్ చేసిన రైడర్ సీటు, వెనక్కి లాగినటువంటి హ్యాండిల్, కాళ్లు చాచుకునే విధంగా ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు ఉన్నాయి. కానీ రైడర్ సీటుతో పోల్చితే వెనకసీట పరిమితంగా కనిపిస్తుంది. అలాగే ఇది సిటీ రైడ్‌లకు మాత్రమే పనికొచ్చేలా ఉంది, సుదూర ప్రయాణాలకు అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఎత్తు తక్కువగా ఉండటం చేత రైడర్లకు సరైన నియంత్రణను ఆశించవచ్చు.

ఈ మోటార్ సైకిల్ మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ , మ్యాట్ గ్రే అనే మూడు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది.

దీని ధరను ఇంకా వెల్లడించలేదు, అయితే ఆన్‌లైన్‌లో కీవే ఇండియా వెబ్‌సైట్ లేదా బెనెల్లీ డీలర్‌షిప్‌లలో బుకింగ్‌ చేసి సంప్రదించవచ్చు.

టాపిక్