Sunset Foods : సూర్యాస్తమయం తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
03 April 2023, 18:30 IST
- Sunset Foods : మెుత్తం ఆరోగ్యంగా ఉండాలంటే.. పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జీర్ణవ్యవస్థ మీదే.. మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఏది పడితే అది తిని నాశనం చేసుకోవద్దు. మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది.
సూర్యాస్తమయం ఫుడ్స్
ఆయుర్వేదంలో సూర్యాస్తమయం తర్వాత గంటలను 'సంధ్యా కాలాలు' అంటారు. ఈ సమయంలో శరీరం జీర్ణ అగ్ని సహజంగా క్షీణించడం ప్రారంభిస్తుందని నమ్ముతారు. అంటే ఈ సమయంలో మనం తినే ఆహారం(Food) జీర్ణం కావడం కష్టం. అందువల్ల ఆయుర్వేద సూత్రాలు(Ayurveda Tips) పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సూర్యాస్తమయం(Sunset) తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నాయి.
ఆయుర్వేదం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత పచ్చి ఆహారాన్ని(Food) తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణం(digestion) కావడం కష్టం. సలాడ్‌లు, ఉడకని కూరగాయలు, పండ్లు వంటి పచ్చి ఆహారాలకు చాలా జీర్ణశక్తి కావాలి. రాత్రిపూట తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్(Gas)ను కలిగిస్తుంది. బదులుగా, కాల్చిన లేదా ఉడికించిన కూరగాయలు తీసుకుంటే మంచిది.
ఆయుర్వేద సూత్రాలు సూర్యాస్తమయం తర్వాత ఆయిల్ ఫుడ్(Oil Food) నివారించాలని సూచిస్తున్నాయి. వేయించిన ఆహారం, జున్ను, రెడ్ మీట్ వంటి ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కడుపులో భారమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆహారాలు శరీరం సహజ లయకు భంగం కలిగిస్తాయి. మంచి నిద్ర(Healthy Sleep)ను నిరోధిస్తాయి. బదులుగా, ఆయుర్వేదం సూప్‌లు, ధాన్యాలు వంటి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది.
సుగంధ ద్రవ్యాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతాయి. అందుకోసమే.. సాయంత్రం వేళల్లో స్పైసీ ఫుడ్స్(Spicy Foods)ను పరిమితం చేసి, బదులుగా జీలకర్ర, కొత్తిమీర వంటి తేలికపాటి మసాలాలను ఎంచుకోవాలి.
కెఫీన్, ఆల్కహాల్ రెండూ శరీరం యొక్క సహజ నిద్ర(Sleep) చక్రాన్ని దెబ్బతీస్తాయి. అవి జీర్ణవ్యవస్థపై కూడా కఠినంగా ఉంటాయి. వాటికి బదులుగా చమోమిలే, పుదీనా వంటి హెర్బల్ టీ(Herbal Tea)లు విశ్రాంతిని ప్రోత్సహించడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ఉంచుకోవచ్చు.
ఆయుర్వేదం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ముడి ఆహారాన్ని తినొద్దు. ఎందుకంటే అవి జీర్ణం కావడం చాలా కష్టంగా ఉంటుంది. సలాడ్లు, పచ్చి కూరగాయలు, పండ్లు వంటి ముడి ఆహారాలకు జీర్ణ శక్తి చాలా కావాలి. అందులోనూ వీటిని రాత్రిపూట తింటే కడుపు ఉబ్బరం, అజీర్థి, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతారు. గట్ ఆరోగ్యం(Gut Health) మెరుగ్గా ఉంటేనే మన మొత్తం శరీరం ఆరోగ్యంగానూ ఉంటుంది. ఆయుర్వేదం.. జీర్ణవ్యవస్థను మొత్తం ఆరోగ్యానికి మూలంగా భావిస్తుంది. మనం తినే విధానం ఎంత ముఖ్యమో మనం ఏం తింటున్నామో కూడా అంతే ముఖ్యమని ఆయుర్వేదం చెబుతోంది.