ఆయుర్వేదంతో క్యాన్సర్ తగ్గిస్తామని రూ.15లక్షలు వసూలు: చివరికి..!-railway staffer says ayurveda centre cheated him 15 lakh rupees over his wife cancer treatment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Railway Staffer Says Ayurveda Centre Cheated Him 15 Lakh Rupees Over His Wife Cancer Treatment

ఆయుర్వేదంతో క్యాన్సర్ తగ్గిస్తామని రూ.15లక్షలు వసూలు: చివరికి..!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 26, 2023 02:06 PM IST

Maharashtra: ఆయుర్వేద కేంద్రంలో ఓ రైల్వే ఉద్యోగి ఫిర్యాదు చేశారు. క్యాన్సర్ చికిత్స పేరుతో కేంద్రం నిర్వాహకులు రూ.15లక్షలకు మోసం చేశారని ఆరోపించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

Maharashtra: ఆయుర్వేద చికిత్స పేరుతో తనను మోసం చేశారంటూ ఓ ఆయుర్వేద సెంటర్‌(Ayurveda centre)పై ఓ రైల్వే ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యకు క్యాన్సర్ నయం చేస్తామని చెప్పి, చివరికి చేతులెత్తేశారని పేర్కొన్నారు. లక్షలకు లక్షలు వసూలు చేశారని తెలిపారు. మహారాష్ట్రలోని థానే(Thane)లో ఇది జరిగింది. వివరాలివే..

రూ.15.22లక్షలు వసూలు

Maharashtra: తన భార్యకు ఉన్న క్యాన్సర్‌ను చికిత్సతో నయం చేస్తామని తన వద్ద రూ.15,22లక్షలు తీసుకొని మోసం చేశారని ఆయుర్వేద కేంద్రం నిర్వాహకులపై రైల్వేలో పెయింటర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని నౌపడా పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.

సంవత్సరం నుంచి..

Maharashtra: సంవత్సరం నుంచి ఆయుర్వేదం చికిత్స నిర్వాహకులు తన భార్యకు చికిత్స నిర్వహించినా క్యాన్సర్ ఏ మాత్రం తగ్గలేదని ఆ రైల్వే ఉద్యోగి ఫిర్యాదులో తెలిపారు. “గతేడాది ఫిబ్రవరిలోనే తన భార్యకు చికిత్స మొదలుపెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి మెరుగుదల కనిపించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆయుర్వేద కేంద్రం సిబ్బంది ఆయనను పట్టించుకోకుండా ఉన్నారు. మోసం చేసినందుకు గాను ఆయుర్వేద కేంద్రానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేశాం” అని పోలీసు అధికారి వెల్లడించారు.

ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

రెట్టింపు డబ్బు ఇస్తామంటూ..

Maharashtra: ఇటీవల మహారాష్ట్రలోని థానేలో మరో చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ.. కస్టమర్లకు ఏకంగా రూ.68లక్షలకు టోకరా వేసింది. ఈ విషయంపై థానే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రికరింగ్ డిపాజిట్ల రూపంలో 16 నుంచి 20 శాతం లాభాలు ఇస్తామని ఆశ చూపి.. 17 మంది నుంచి ఆ కంపెనీ ప్రతినిధులు డబ్బు తీసుకున్నారు. 60 నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికి రెట్టింపు ఇస్తామని నమ్మించారు. కాగా, 2013లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఆ కంపెనీ ఎలాంటి చెల్లింపులు చేయలేదు. ఈ తరుణంలో బాధితులు ఇటీవల థానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ప్రతినిధులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

IPL_Entry_Point