తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee5 Announces A New Original Titled Maya Bazar Which Will Produce By Rana Daggubati

Zee 5 New original Maya Bazar: రానా నిర్మాణంలో వెబ్‌సిరీస్.. జీ5లో రానున్న మాయా బజార్

01 September 2022, 20:10 IST

    • Rana Daggubati Produce MayaBazar: రానా దగ్గుబాటి నిర్మాణంలో ఓ వెబ్‌సిరీస్ రానుంది. అదే మాయా బజార్: ఏ ప్యారడైజ్ ఆన్ ఎర్త్. ఈ సిరీస్‌ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి గౌతమ్ చల్లగుళ్ల దర్శకత్వం వహిస్తున్నారు.
రానా నిర్మాణంలో వెబ్ సిరీస్ ప్రారంభం
రానా నిర్మాణంలో వెబ్ సిరీస్ ప్రారంభం (Feed)

రానా నిర్మాణంలో వెబ్ సిరీస్ ప్రారంభం

Rana Daggubati Produce Zee5 Origginal: కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రేక్షకులు డిజిటల్ మాధ్యమానికి అలవాటుపడటంతో వారే లక్ష్యంగా కుప్పలు తెప్పలుగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 లాంటి ఓటీటీ సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. ఇటీవల కాలంలో జీ5లో అదిరిపోయే వెబ్‌సిరీస్‌లు వస్తున్నాయి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, రెక్కీ, హలో వరల్డ్ లాంటివి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ ఓటీటీ సంస్థ మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రానా దగ్గుబాటి నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ పేరు మాయ బజార్: ఏ ప్యారడైజ్ అన్ ఎర్త్. ఈ ఒరిజినల్ సిరీస్‌కు గౌతమ్ చల్లగుళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. వీకే నరేశ్, ఝాన్సీ, ఈషా రెబ్బ, రవి వర్మ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జెర్రీ సిల్వస్టర్ ఈ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యాదవ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు.

ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్న గౌతమ్ మాట్లాడుతూ.. "ఓ గెటేడ్ కమ్యునిటీ ప్రారంభం రోజున ఆ కమ్యునిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ ప్రముఖుడు అనుమానస్పద రీతిలో మరణిస్తాడు. అతడి మృతి చుట్టూ ఈ సిరీస్ కథ సాగుతుంది. అని ఆయన అన్నారు. ఈ రోజుల్లో గేటెడ్ కమ్యూనిటిలో విల్లాను సొంతం చేసుకోడాన్ని చాలా మంది సామాజిక, ఆర్థిక హోదాకు సంకేతంగా భావిస్తున్నారని, కొత్తగా పెళ్లయిన యువతీ యువకుల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకు విభిన్న నగరాల్లో విల్లాలను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి గేటెడ్ కమ్యూనిటిలో ఓ ప్రముఖుడు మరణిస్తే ఎలాంటి అనుమానాలు మొదలయ్యాయనేవి ఈ సిరీస్ కథ సాగుతుంది" అని స్పష్టంచేశారు.

<p>క్లాప్ కొట్టిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు</p>

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.