తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Birthday Special: పవర్‌స్టార్ బర్త్‌డేకు పవర్‌ఫుల్ గిప్ట్.. రేపు హరి హర వీర మల్లు నుంచి అదిరే సర్‌ప్రైజ్

Pawan Kalyan Birthday Special: పవర్‌స్టార్ బర్త్‌డేకు పవర్‌ఫుల్ గిప్ట్.. రేపు హరి హర వీర మల్లు నుంచి అదిరే సర్‌ప్రైజ్

HT Telugu Desk HT Telugu

01 September 2022, 18:41 IST

    • Pawan Kalyan Birthday Special: పవన్ కళ్యాణ్ హీరోగా, సృజనాత్మక దర్శకుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మహత్తర చిత్ర రాజం‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక. శుక్రవారం పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనుంది చిత్రబృందం.
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ (Twitter)

పవన్ కల్యాణ్

Pawan Kalyan Birthday Special: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ప్రచార చిత్రంను నేడు విడుదల చేసింది "హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" చిత్ర బృందం. గురువారం సాయంత్రం గం: 5.45 నిమిషాలకు పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. వారి ఆనందాన్ని మరింత ఉచ్ఛ స్థితికి వెళ్లేలా ఆ వీడియో ఉండబోతోందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Yuvaraj OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కాంతార హీరోయిన్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన బాహుబలి ప్రీక్వెల్.. కానీ, అదొక్కటే నిరాశ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల శ‌కం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్య‌ద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు" సినిమా రూపొందుతోంది. ఇది ఒక లెజండ‌రీ బందిపోటు వీరోచిత గాథ." ఇది భార‌తీయ సినిమాలో ఇప్ప‌టిదాకా చెప్ప‌ని క‌థ‌. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఒక మ‌ర‌పురాని అనుభ‌వాన్ని ఇస్తుంది. ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌ని ఉన్న‌త‌స్థాయి నిర్మాణ విలువ‌ల‌తో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్‌-ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.

ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ యాభై శాతం పూర్త‌యింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు తెలియచేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపు దిద్దుకుంటోంది.

ఈ చిత్రానికి అగ్ర‌శ్రేణి సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి సంగీత బాణీలు అందిస్తుండ‌గా, పేరొందిన సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా కె.ఎల్. ప్రవీణ్ పూడి, విఎఫ్ఎక్స్ హరి హర సుతన్, పోరాటాలు శామ్ కౌశల్, తడోర్ లజరొవ్ జుజి, రామ్ లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్ లు సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడ‌క్ష‌న్‌ బ్యాన‌ర్‌ పై నిర్మాత‌ ఎ.ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం