తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vikkatakavi Review: వికటకవి రివ్యూ.. జీ5 ఓటీటీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Vikkatakavi Review: వికటకవి రివ్యూ.. జీ5 ఓటీటీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

28 November 2024, 14:05 IST

google News
    • Vikkatakavi Web Series Review In Telugu: జీ5 ఓటీటీలోకి ఇవాళ స్ట్రీమింగ్‌కు వచ్చిన డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ నటించిన వికటకవి తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ తెలుగు సిరీస్ ఎలా ఉందో వికటకవి రివ్యూలో తెలుసుకుందాం. 
వికటకవి రివ్యూ.. జీ5 ఓటీటీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ.. జీ5 ఓటీటీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

వికటకవి రివ్యూ.. జీ5 ఓటీటీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

టైటిల్: వికటకవి (తెలుగు వెబ్ సిరీస్)

నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, రఘు కుంచె, తారక్ పొన్నప్ప, ముక్తర్ ఖాన్, అమిత్ తివారీ తదితరులు

దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి

కథ: సాయి తేజ్

సంగీతం: అజయ్ అరసాడా

సినిమాటోగ్రఫీ: షోయెబ్ సిద్ధికీ

నిర్మాత: రజనీ తాళ్లూరి

ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5

ఎపిసోడ్: 6 (ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారుగా 40 నిమిషాలు)

Vikkatakavi Review Telugu: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మొదటి డిటెక్టివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వికటకవి జీ5లోకి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోన్న మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో వికటకవి రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

1970లో తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఈ కథ నడుస్తుంది. అమరగిరి సంస్థానంలోని దేవతలగుట్ట ప్రాంతానికి వెళ్లిన జనాలు జ్ఞాపకాలు మర్చిపోయి వింత మనుషుల్లా ప్రవరిస్తుంటారు. దేవతలగుట్టకు అక్కడి దేవత శాపం ఇచ్చిందని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతుంటారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో రామకృష్ణ (నరేష్ అగస్త్య) ఎంతో తెలివైన విద్యార్థి. ప్రతి సమస్యను తన తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉంటాడు.

కట్ చేస్తే తన తల్లి ఆపరేషన్ కోసం ట్రై చేస్తున్న రామకృష్ణకు దేవతల గుట్ట గురించి తెలుస్తుంది. మిస్టరీలు అంటే ఇష్టపడే రామకృష్ణ దేవతల గుట్టలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రామకృష్ణకు ఎమ్మెల్యే రఘుపతి (రఘు కుంచె) కూతురు లక్ష్మీ (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది.

ట్విస్టులు

ఆ తర్వాత అమరగిరిలో రామకృష్ణకు ఎదురైన సంఘటనలు ఏంటీ? దేవతల గుట్ట మీద ఏం జరుగుతుంది? అక్కడ రామకృష్ణ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ? అమరగిరికి రామకృష్ణకు ఏమైనా సంబంధం ఉందా? రామకృష్ణ గతం ఏంటీ? దేవతల గుట్ట సమస్యను రామకృష్ణ పరిష్కరించాడా? అనే థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే జీ5 ఓటీటీలో ఉన్న వికటకవి వెబ్ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే సాధారణంగా ఒకరకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఇలాంటి జోనర్‌లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎంత థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ నెరేషన్‌తో తెరకెక్కిస్తే అవి అంత బాగా ఆదరణ పొందుతాయి. ఈ విషయంలో తెలుగులో వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వికటకవి చాలా వరకు విజయం సాధించిందనే చెప్పుకోవాలి.

అమరగిరిలో వచ్చే సీన్స్

దేవతల గుట్ట శాపం, అక్కడికి వెళ్లిన 32 మంది వింతగా ప్రవర్తించడం వంటి సీన్లతో వెబ్ సిరీస్‌పై మంచి క్యూరియాసిటీ కలిగించారు. 1970 బ్యాక్ డ్రాప్‌లో కథ ఉంటుంది కాబట్టి దానికి తగినట్లుగా చేసిన వర్క్ బాగుంది. ఆ సమయానికి తగినట్లుగా సీన్స్, ప్రదేశాలు, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక అన్ని పజిల్స్ సాల్వ్ చేసే రామకృష్ణకు అమరగిరిలో ఎదురయ్యే సంఘటనలు పర్వాలేదు.

అయితే, వికటవి కథే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దానికి తెలంగాణ, 1979 బ్యాక్ డ్రాప్ అద్దడం మరింత క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. సిరీస్‌ లోపలికి వెళ్లేకొద్ది వచ్చే లేయర్స్ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. సాయి తేజ్ రాసుకున్న కథకు ప్రదీప్ మద్దాలి విజన్ తోడై ఎంగేజింగ్‌గా చక్కారు ఈ సిరీస్‌ను. ఎపిసోడ్ ఎండింగ్‌లో మంచి ట్విస్ట్‌ ఇస్తూ తర్వాతి ఎపిసోడ్‌ను ప్రేక్షకుడు చూసేలా ఎంగేజ్ చేస్తుంది.

బాగున్న కెమెరా వర్క్

అయితే, అక్కడక్కడ కొన్ని సీన్స్ సాగదీతలా అనిపిస్తుంది. కానీ, అవి కథ పరంగా ఓకే అనిపించేలా ఉన్నాయి. సిరీస్‌లో రజాకార్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ప్రస్తావించారు. డిటెక్టివ్ థ్రిల్లర్స్‌గా తగినట్లుగా కెమెరా వర్క్ ఉంది. అలాగే, అజయ్ అరసాడా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అట్రాక్ట్ చేసేలా ఉంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఇక కేసులు సాల్వ్ చేసే డిటెక్టివ్‌గా నరేష్ అగస్త్య ఆకట్టుకున్నాడు. నరేష్‌కు నటనపరంగా వికటకవి మరో మంచి సిరీస్ అవుతుంది. మేఘా ఆకాష్ కూడా ఆకట్టుకుంది. రఘు కుంచె, షిజు మీనన్, తారక్ పొన్నప్ప‌తోపాటు మిగతా పాత్రల నటన కూడా సిరీస్‌ను ఎంగేజ్ చేసేలా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్‌తో రెండో సీజన్‌కు హింట్ ఇచ్చారు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే మంచి తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్‌ను చూడాలనుకునేవారికి వికటకవి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

రేటింగ్: 3/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం