Anil Ravipudi: సుందరకాండ తర్వాత వెంకటేష్ అలా చేసిన సినిమా, క్లైమాక్స్ వన్ మ్యాన్ షో.. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్
Anil Ravipudi On Venkatesh Sankranthiki Vasthunnam: సుందరకాండ సినిమా తర్వాత హీరో వెంకటేష్ అలా కంప్లీట్‌గా కనిపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ ప్రకటన ప్రెస్ మీట్‌లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Anil Ravipudi On Venkatesh Sankranthiki Vasthunnam: హీరో విక్టరీ వెంకటేష్, కామెడీ యాక్షన్ డైరెకక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల తర్వాత వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం తెరకెక్కింది.
సంక్రాంతి కానుకగా
ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా చేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా 2025 జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సంక్రాంతితో స్పెషల్ కనెక్షన్
"సంక్రాంతి వస్తున్నాం జనవరి 14న మీ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి నాకు స్పెషల్ కనెక్షన్ ఉంది. సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 హ్యుజ్ బ్లాక్ బస్టర్ అయింది. మహేశ్ గారితో చేసిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్లీ నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారితో, నాకు ఇష్టమైన దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్‌లో మీ అందరినీ నవ్వించడానికి సంక్రాంతి వస్తున్నాంతో వస్తున్నాం" అని అనిల్ రావిపూడి అన్నారు.
క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో
"భగవంత్ కేసరి ఫిల్మ్ మేకర్స్‌గా నేను చాలా తృప్తి పొందిన సినిమా. అంతే తృప్తిని ఇచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం. జోనర్, స్క్రిప్ట్, రైటింగ్ పరంగా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటీఫుల్ జర్నీ. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో చేయడం జరిగింది. కచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు.
మంచి ఫన్ టైమింగ్
"వెంకటేష్ గారు, నా కాంబినేషన్ హ్యాట్రిక్ ఫిల్మ్‌గా రాబోతోంది. లుక్, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా టైం స్పెండ్ చేశాం. సుందరకాండ తర్వాత వెంకటేష్ గారు కంప్లీట్ గ్లాసెస్‌తో చేసిన సినిమా ఇది. ఇందులో క్లైమాక్స్‌లో వన్ మ్యాన్ షో ఉంటుంది. అది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఐశ్వర్య రాజేష్ పాత్ర మీకు గుర్తుండిపోతుంది. మీనాక్షిలో చాలా మంచి ఫన్ టైమింగ్ ఉంది" అని అనిల్ రావిపూడి చెప్పారు.
గేమ్ ఛేంజర్ ఇంకా పెద్ద హిట్ కావాలి
"అలాగే ఈ సినిమాలో చేసిన నరేష్ గారితో పాటు అన్నీ పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయి. రాజు గారి బ్యానర్ అంటే నా బ్యానర్‌లా ఫీల్ అవుతుంటాను. వారితో ఇది నా ఐదో సినిమా. సంక్రాంతికి సినిమా పెద్ద హిట్ కావాలి. రాజు గారి నుంచి మరో సినిమాగా వస్తున్న రామ్ చరణ్ గారి గేమ్ ఛేంజర్ ఇంకా పెద్ద హిట్ కావాలి. అలాగే నా హీరో బాలయ్య బాబు గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. అన్ని జోనర్ సినిమాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి" అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
టాపిక్