Sahkutumbanaam: రేష‌ర్‌కార్డుతో సఃకుటుంబానాం ఫ‌స్ట్ లుక్ - వైర‌ల్ అవుతోన్న మేఘా ఆకాష్ కొత్త మూవీ పోస్ట‌ర్‌-tollywood news megha akash rajendra prasad sahakutumbanam movie first look motion poster unveiled ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sahkutumbanaam: రేష‌ర్‌కార్డుతో సఃకుటుంబానాం ఫ‌స్ట్ లుక్ - వైర‌ల్ అవుతోన్న మేఘా ఆకాష్ కొత్త మూవీ పోస్ట‌ర్‌

Sahkutumbanaam: రేష‌ర్‌కార్డుతో సఃకుటుంబానాం ఫ‌స్ట్ లుక్ - వైర‌ల్ అవుతోన్న మేఘా ఆకాష్ కొత్త మూవీ పోస్ట‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 12, 2024 12:32 PM IST

Sahkutumbanaam:మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న సఃకుటుంబానాం మూవీ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌ల రిలీజైంది. రేష‌న్ కార్డులా డిజైన్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

సఃకుటుంబానాం మూవీ ఫ‌స్ట్ లుక్
సఃకుటుంబానాం మూవీ ఫ‌స్ట్ లుక్

Sahkutumbanaam: మేఘా ఆకాష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న తెలుగు మూవీ సఃకుటుంబానాం ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ ఇటీవ‌ల రిలీజైంది. రేష‌న్ కార్డుపై రాజేంద్ర‌ప్ర‌సాద్ అండ్ ఫ్యామిలీని చూపిస్తూ రిలీజ్ చేసిన ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

రాజేంద్ర‌ప్ర‌సాద్ ఫ్యామిలీ...

ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో రాజేంద్ర‌ప్ర‌సాద్ పేరు ప్ర‌సాద్ రావ్‌గా క‌నిపిస్తోంది. భార్య తుల‌సి, కొడుకులు క‌ళ్యాణ్, విక్కీ, కూతురు సోని అంటూ ఫ్యామిలీని ప‌రిచ‌యం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. రేష‌న్ కార్డుపై ఉన్న ఫొటోలో ఒక‌రినొక‌రు కోపంగా చూసుకుంటూ ఫొటో దిగ‌డం ఆస‌క్తిని పంచుతోంది. సఃకుటుంబానాం సినిమాతో రామ్ కిరణ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. అత‌డికి జోడీగా మేఘ ఆకాష్ క‌నిపించ‌బోతున్న‌ది. సఃకుటుంబానాం సినిమాకు ఉద‌య్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అచ్చ తెలుగింటి టైటిల్‌...

సఃకుటుంబానాం గురించి ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ... సినిమాకు అచ్చమైన తెలుగింటి టైటిల్ పెట్టారంటూ అంద‌రూ మెచ్చుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని తెలిపాడు. రేషన్ కార్డు డిజైన్ లా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న‌ద‌ని, ఇదే క్రియేటివిటీ క‌థ‌, క‌థ‌నాల్లో క‌నిపిస్తుంద‌ని తెలిపాడు. కామెడీ, ఎమోష‌న్స్ క‌ల‌బోసిన మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని నిర్మాత అన్నాడు.

రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సత్య, రాజశ్రీ నాయర్, శుభలేఖ సుధాకర్, భద్రం, తాగుబోతు రమేష్, నిత్యశ్రీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు నిర్మాత వెల్ల‌డించాడు. తెలిపాడు. ఈ సఃకుటుంబానాంకు మ్యుజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మధు దాసరి, శశాంక్ మాలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌...

డైరెక్టర్ ఉదయ్ శర్మ మాట్లాడుతూ సఃకుటుంబానాం సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అన్నాడు. ప్ర‌తిభావంతులైన మంచి ఆర్టిస్టుల కాంబినేష‌న్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంద చెప్పాడు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం కామెడీ హిలేరియ‌స్‌గా న‌వ్విస్తుంద‌ని చెప్పారు మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎప్పుడు ఆదరిస్తార‌ని, ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టే సినిమా ఇద‌ని డైరెక్ట‌ర్ పేర్కొన్నాడు. త్వరలోనే సఃకుటుంబానాం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

నితిన్ మూవీతో..

జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో చ‌క్క‌టి అవ‌కాశాల‌ను అందుకుంటోంది మేఘా ఆకాష్‌. నితిన్‌తో లై, ఛ‌ల్‌ మోహ‌న‌రంగ సినిమాల‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఈ రెండు సినిమాలు డిజాస్ట‌ర్స్ అయ్యాయి. ర‌జ‌నీకాంత్ పేట‌, ధ‌నుష్ తూటాతో పాటు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే అవ‌కాశాలు చాలా వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్ హిట్టు మాత్రం అందుకోలేక‌పోయింది మేఘా ఆకాష్‌. .

త‌మిళంలో సంతానంతో సినిమా...

గ‌త ఏడాది తెలుగులో ర‌వితేజ రావ‌ణాసుర‌లో నెగెటివ్ షేడ్స్ పాత్ర‌లో క‌నిపించింది. ఈ మూవీతో పాటు మ‌ను చ‌రిత్ర‌, ప్రేమ‌దేశం వంటి సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో ఓ మూడు సినిమాలు చేస్తోంది. త‌మిలంలో సంతానంతో వ‌డ‌క్కుప‌ట్టి రామ‌సామి అనే సినిమా చేసింది మేఘా ఆకాష్. వడక్కుపట్టి రామసామి తోనే టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

IPL_Entry_Point