Agent OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్ - రిలీజ్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ-producer anil sunkara gives clarity on akhil akkineni agent ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Ott: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్ - రిలీజ్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ

Agent OTT: ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్ - రిలీజ్‌పై ప్రొడ్యూస‌ర్ క్లారిటీ

Nelki Naresh Kumar HT Telugu
Apr 09, 2024 12:07 PM IST

Agent OTT: అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై నిర్మాత అనిల్ సుంక‌ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏజెంట్ మూవీ అతిత్వ‌ర‌లో ఓటీటీలోకి రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు.

అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఓటీటీ
అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఓటీటీ

Agent OTT: అఖిల్ ఏంజెల్ థియేట‌ర్ల‌లో విడుద‌లై దాదాపు ఏడాది కావ‌స్తోన్న ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. ఈ స్పై యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్ ఓటీటీ కొనుగోలు చేసింది. ఏజెంట్‌ను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సోనీ లివ్ ప‌లుమార్లు ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మ‌ధ్య ఉన్న కోర్టు గొడ‌వ‌ల‌తో పాటు రీ ఎడిటింగ్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఏజెంట్ ఓటీటీ రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ఈ స్పై మూవీ ఓటీటీ రిలీజ్‌పై అభిమానులు కూడా ఆశ‌ల‌ను వ‌దులుకున్నారు. ఏజెంట్ మూవీని ఓటీటీలో చూడ‌టం క‌లేన‌ని అఖిల్ అభిమానులు ఫిక్స‌య్యారు.

అనిల్ సుంక‌ర ట్వీట్‌...

తాజాగా అఖిల్ ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ప్రొడ్యూస‌ర్ అనిల్ సుంక‌ర మ‌రోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హీరో అఖిల్ అక్కినేనితో పాటు అనిల్ సుంక‌ర‌ను ట్యాగ్ చేస్తూ ఏజెంట్‌ను ఓటీటీలో రిలీజ్ చేయండి అంటూ ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఆ నెటిజ‌న్ ట్వీట్‌కు అనిల్ సుంక‌ర రిప్లై ఇచ్చాడు.

ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్‌కు అమ్మిన‌ట్లు అనిల్ సుంక‌ర తెలిపాడు. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని చాలా సార్లు చెప్పాన‌ని గుర్తుచేశారు. అతి త్వ‌ర‌లోనే ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అనిల్ సుంక‌ర ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్ అవుతోంది. అనిల్ సుంక‌ర ట్వీట్‌ను బ‌ట్టి తొంద‌ర‌లోనే ఏంజెట్ ఓటీటీలోకి రావ‌చ్చున‌ని తెలుస్తోంది.

ఎన‌భై కోట్ల బ‌డ్జెట్‌...

ఏజెంట్ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్పై యాక్ష‌న్ క‌థ‌తో దాదాపు ఎన‌భైకోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. గ‌త ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేట‌ర్ల‌లో కేవ‌లం ఎనిమిది కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టి బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. తెలుగుతో పాటు మ‌ల‌యాళంలో రిలీజ్ చేయ‌గా అక్క‌డ కూడా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది. ఏజెంట్ మూవీకి ఓ ప్రొడ్యూస‌ర్‌గా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు.

ఏజెంట్ మూవీలో మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషించ‌గా... డినో మారియా విల‌న్‌గా న‌టించాడు. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఏజెంట్ క‌థ ఇదే...

ఇందులో రిక్కీ అలియాస్ రామ‌కృష్ణ అనే ఏజెంట్ పాత్ర‌లో అఖిల్ న‌టించాడు. చైనాతో క‌లిసి ఇండియాను నాశ‌నం చేసేందుకు గాడ్ (డినో మారియో) అనే వ్య‌క్తి చేస్తోన్న కుట్ర‌ల‌ను మ‌హాదేవ్ (మ‌మ్ముట్టి)సాయంతో రిక్కీ ఎలా ఎదుర్కొన్నాడ‌న్న‌దే ఏజెంట్ మూవీ క‌థ‌. రొటీన్ స్టోరీలైన్ కావ‌డం, క‌థ‌లో ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ లేక‌పోవ‌డంతో ఏజెంట్ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయింది.

అఖిల్ నెక్స్ట్ మూవీ…

ఏజెంట్ త‌ర్వాత అఖిల్ అక్కినేని నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ రాలేదు. అనిల్ అనే కొత్త ద‌ర్శ‌కుడితో అఖిల్ సోషియో ఫాంట‌సీ ల‌వ్ స్టోరీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ ఈ మూవీ ఉంటుందా? లేదా? అన్న‌ది క్లారిటీ రాలేదు.

టాపిక్