Akhil Hombale Films Movie: అఖిల్‌తో సలార్ మేకర్స్ మూవీ.. భారీ బడ్జెట్‌తో..-akhil hombale films movie salaar makers huge budget movie with akhil akkineni tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhil Hombale Films Movie: అఖిల్‌తో సలార్ మేకర్స్ మూవీ.. భారీ బడ్జెట్‌తో..

Akhil Hombale Films Movie: అఖిల్‌తో సలార్ మేకర్స్ మూవీ.. భారీ బడ్జెట్‌తో..

Hari Prasad S HT Telugu

Akhil Hombale Films Movie: అఖిల్ అక్కినేనితో సలార్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ మూవీ తీయబోతున్నారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏజెంట్ మూవీ ఫ్లాప్‌తో ఢీలా పడిన అఖిల్.. ఇప్పుడు మరో భారీ బడ్జెట్ మూవీ కోసం సిద్ధమవుతున్నాడు.

అఖిల్ అక్కినేని (twitter)

Akhil Hombale Films Movie: అఖిల్ అక్కినేని తన చివరి మూవీ ఏజెంట్ తో చాలా నిరాశ చెందాడు. భారీ బడ్జెట్ తో వచ్చినా ఆ మూవీ అభిమానులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు అతడు సలార్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది.

యూవీ క్రియేషన్స్ తో కలిసి హోంబలే సహ నిర్మాతగా ఈ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

అఖిల్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి చాన్నాళ్లే అవుతున్నా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. గతేడాది సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఏజెంట్ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నా.. అది కాస్తా కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ మూవీ ఫెయిల్యూర్ తో అఖిల్ తీవ్రంగా నిరాశ చెందాడు. అయితే కేజీఎఫ్, కాంతారా, సలార్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ అందించిన హోంబలే ఫిల్మ్స్ తో అఖిల్ మూవీ చేయబోతుండటం మాత్రం అతని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

అనిల్ కుమార్ అనే వ్యక్తి డైరెక్టర్ గా అఖిల్ అక్కినేనితో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా చేయబోతోందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడీ సినిమాను యూవీ క్రియేషన్స్.. హోంబలే ఫిల్మ్స్ తో కలిసి నిర్మించాలని చూస్తోంది. ఇప్పుడీ వార్త టాలీవుడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది.

సలార్ సెలబ్రేషన్స్‌లో అఖిల్ అందుకేనా?

ఈ మధ్య జరిగిన సలార్ ఫస్ట్ పార్ట్ సెలబ్రేషన్స్ లో అఖిల్ అక్కినేని కనిపించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అసలు అతనికి సలార్ తో ఏంటి సంబంధం? సలార్ సీక్వెల్ లో దేవా తమ్ముడిగా అతడేమైనా కనిపించబోతున్నాడా అని ఫ్యాన్స్ సందేహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ తో అఖిల్ మూవీ చేయబోతున్నాడన్న వార్తల నేపథ్యంలో అతనికి అందుకే ఇన్విటేషన్ వెళ్లిందని స్పష్టమవుతోంది.

ఏజెంట్ మూవీ సరైన స్క్రిప్ట్ లేక బోల్తా పడింది. ఈసారి అఖిల్ విషయంలో అలాంటి తప్పిదం జరగకుండా ఓ పక్కా యాక్షన్ డ్రామా రూపొందించాలని భావిస్తున్న యూవీ క్రియేషన్స్ అందులో భాగంగానే హోంబలే ఫిల్మ్స్ తో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఏజెంట్ మూవీ ఫ్లాపయినా.. అఖిల్ పై మరోసారి భారీ బడ్జెట్ పెట్టడానికి వీళ్లు వెనుకాడటం లేదు.

ఏజెంట్ మూవీతో అఖిల్ ఢీలా పడ్డాడు. గతేడాది ఏప్రిల్లో రిలీజైన ఈ మూవీ.. ఇప్పటికీ ఓటీటీలోకి రాలేదు. సోనీలివ్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నా.. అసలు ఈ మూవీ ఎప్పుడు వస్తుందన్నది తెలియడం లేదు. ఈ సినిమాను నిర్మించిన అనిల్ సుంకర రూ.20 కోట్లు నష్టపోయాడు. ఈ నేపథ్యంలో అఖిల్ ఇప్పుడీ సలార్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నిర్మించే మూవీపై ఆశలు పెంచుకున్నాడు. మరి హోంబలే అయినా అతని అదృష్టాన్ని తిరగరాస్తుందేమో చూడాలి.