Krishnarama Movie OTT Streaming: డైరెక్ట్‌గా ఓటీటీలోకి కృష్ణారామా మూవీ - రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి కాంబో రిపీట్‌!-rajendra prasad gouthami krishnarama movie ott releaese date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishnarama Movie Ott Streaming: డైరెక్ట్‌గా ఓటీటీలోకి కృష్ణారామా మూవీ - రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి కాంబో రిపీట్‌!

Krishnarama Movie OTT Streaming: డైరెక్ట్‌గా ఓటీటీలోకి కృష్ణారామా మూవీ - రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి కాంబో రిపీట్‌!

Nelki Naresh Kumar HT Telugu
Oct 20, 2023 11:47 AM IST

Krishnarama Movie OTT Streaming: రాజేంద్ర‌ప్ర‌సాద్, గౌత‌మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కృష్ణారామా మూవీ థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట‌ర్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో 30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్ ఫేమ్ అన‌న్య శ‌ర్మ కీల‌క పాత్ర పోషిస్తుంది.

రాజేంద్ర‌ప్ర‌సాద్, గౌత‌మి
రాజేంద్ర‌ప్ర‌సాద్, గౌత‌మి

Krishnarama Movie OTT Streaming: బామ్మ బాట బంగారు బాట‌, గాంధీన‌గ‌ర్ రెండ‌వ వీధితో పాటు ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల్లో జంట‌గా న‌టించారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఇటీవ‌ల రిలీజైన అన్నీ మంచి శ‌కున‌ములే మూవీలో ఈ జోడీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది. తాజాగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మి కాంబోలో కృష్ణారామా పేరుతో మ‌రో మూవీ రాబోతోంది. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.

అక్టోబ‌ర్ 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో కృష్ణారామా స్ట్రీమింగ్ కాబోతోంది. కృష్ణారామా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఫేస్‌బుక్ కార‌ణంగా సెల‌బ్రిటీలు మారిన వృద్ధ దంప‌తుల జీవితాల నేప‌థ్యంలో ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. సెల‌బ్రిటీగా మారిన త‌ర్వాత వారికి ఓ పెద్ద స‌మ‌స్య ఎదుర‌వ్వ‌డం, స‌మాజానికి వ్య‌తిరేకంగా ఆ దంప‌తులు పోరాటం సాగించిన‌ట్లుగా ట్రైల‌ర్‌లో చూపించారు.

కృష్ణారామా నాలుగున్న‌ర గంట‌ల‌కు లైవ్‌లో సూసైడ్ చేసుకోబోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు అంటూ న్యూస్ రీడ‌ర్ చెప్ప‌డంతో ట్రైల‌ర్ ఎండ్ కావ‌డం ఆస‌క్తిని పంచుతోంది. ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గౌత‌మితో పాటు 30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్ ఫేమ్ అన‌న్య శ‌ర్మ కీల‌క పాత్ర పోషిస్తుంది. కృష్ణారామా సినిమాకు రాజ్ మాదిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

IPL_Entry_Point